Roja Slams Baalakrishna.. రాజకీయమంటే.! ఆమె దృష్టిలో జస్ట్ నోరు పారేసుకోవడం మాత్రమే.!
తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్న సామెత వుండనే వుంది.! దాన్ని అవతలి వ్యక్తులు అప్లయ్ చేస్తేనో.!
ఓ మహిళను పట్టుకుని ఇలాగేనా అవమానించేది.? అని కన్నీరు పెట్టేయడం సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజాకి కొత్త కాదు.! ఆమె మాత్రం, నోటికొచ్చింది మాట్లాడొచ్చు.
Roja Slams Baalakrishna.. సినిమా వేరు.. రాజకీయం వేరు.!
సినిమా వేరు.! రాజకీయమంటే బాధ్యత.! రాజకీయ నాయకులు బాధ్యతగా వుండాలి.! పైగా, మంత్రి కూడా కాబట్టి, ఇంకా ఇంకా బాధ్యతగా వుండాలి.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇటీవల ‘దరిద్రుడు’ అంటూ విమర్శలు చేశారు రోజా. ఇది విమర్శ కాదు, దూషణ.!1 అదే మాట, పవన్ కళ్యాణ్ తిరిగి రోజాని అంటే.?
తాజాగా, నందమూరిి బాలలకృష్ణ మీద ‘మెంటల్ గాడు’ అంటూ రోజా విరుచుకు పడిపోయింది. బాలకృష్ణ నోరు తెరిస్తే, రోజా పరిస్థితేంటి.?
సభ్యత, సంస్కారం.. ఇవేవీ పట్టవు.!
అధినేత మెప్పుకోసం తప్ప, కాస్తంత సోయ వున్నట్లుగా వ్యవహరించడంలేదు మంత్రి రోజా.!
మంత్రి, ప్రజా ప్రతినిథి.. అన్న విషయాన్ని పక్కన పెడితే, ఓ మనిషిగా కూడా ఆమె తన వ్యాఖ్యల పట్ల ఆత్మపరిశీలన చేసుకోలేకపోతున్నారు.

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వుంటోంది రోజా వ్యవహార శైలి.! ఇదొక అధికార భాషగా మారిపోయి, రోజాని కూడా రాజజకీయ ప్రత్యర్థులు, అలాగే సామాన్యులు తిడితేనో.?
ప్రజలేమనుకుంటున్నారు.? అన్న కనీసపాటి ఇంగితం లేకుండా పోతోంది రాజకీయ నాయకులకి.. పార్టీలకతీతంగా. అదే అసలు సమస్య.! చిత్రంగా, మీడియా సైతం అస్సలేమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది.
Also Read: 360 డిగ్రీస్ తెగులు.! ఈ ‘పచ్చ’ జాడ్యానికి చికిత్స లేదు.!?
రాజకీయ నాయకులు బూతుల్ని మాట్లాడుతున్నా, వారిని వారించలేకపోతున్నారు మీడియా ప్రతినిథులు. పైగా, ఎవరైతే బాగా తిట్టగలుగుతున్నారో, వారి ముందర కెమెరాలు పెడుతున్నారు. ఇంతలా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి.
నడుస్తున్నది రాజకీయం కాదు.. మనం చూస్తున్నది అసలు పాత్రికేయమూ కాదు.!