Roshan Kanakala Bubble Gum.. జక్కన్న రాజమౌళి విడుదల చేసిన టైటిల్, పోస్టర్.. ఇవన్నీ ఎలా వున్నాయ్.? ఎలా వుంటే మాత్రం, రాజమౌళికేంటి సంబంధం.?
సినిమాలో హీరో ఎవరో తెలుసా.? బుల్లితెర స్టార్ యాంకర్ సుమ తనయుడు.! అదేనండీ, సినీ నటుడు రాజీవ్ కనకాల – సుమ దంపతుల కుమారుడు రోషన్.!
రోషన్ కనకాల హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ ఏంటో తెలుసా.! ‘బిజి’ అంటే, ‘బబుల్ గమ్’ అన్నమాట.!
ఇది కూడా టైటిలే.!
పోకిరి.. కంత్రీ.. ఇలా చిత్ర విచిత్రమైన టైటిళ్ళను చూశాం. కొన్ని హిట్లు.. ఇంకొన్ని డిజాస్టర్లు.! అయినా, పేరులో ఏముంది.?
లేకపోవడమేంటి.? ఒక్కోసారి ఆయా టైటిళ్ళు ఆ సినిమాకి వేరే లెవల్ మైలేజ్ తీసుకొస్తాయ్.!
ఇ:తకీ, ‘బబుల్ గమ్’ కథా కమామిషు ఏంటి.? యూత్ ఫుల్ లవ్ స్టోరీ అయి వుంటుంది.! ఫొటో చూస్తే అర్థమయిపోతోంది కదా.!
సుమ అంటే ఎంత రెస్పెక్టు.! అలాంటి సుమ తనయుడు.. ఇలా రొమాంటిక్ పోజుల్లో.! బాలేదబ్బాయ్.. అంటున్నారు కొందరు.!
కానీ, రాజీవ్ కనకాల కొన్ని సినిమాల్లో చేసిన విలన్ రోల్స్, ఆ విలన్ పాత్ర ప్రదర్శించిన పైశాచికత్వం.. ఇది పరిగణనలోకి తీసుకుంటే, కుర్రాడు రొమాంటిక్ అనుకోవాలేమో.!
అయినా, ట్రెండ్ మారింది.! లిప్ లాక్ లేకుండా.. రొమాంటిక్ సీన్స్ లేకుండా సినిమా అంటే, కాస్త కష్టమే సుమీ.!