Rowdy Vijay Mahanati Keerthy.. ‘రౌడీ’ అంటే అందరికి గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత అభిమానులు ఆయనను ముద్దుగా పిలుచుకుంటున్నారిలా.
అలా ‘రౌడీ స్టార్’ అయిపోయాడు విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కోసం.
అందుకేనేమో ఇప్పుడు ‘రౌడీ జనార్ధన్’గా అవతారమెత్తబోతున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు ‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో చాలా ఆశలు రేకెత్తించింది.
కానీ, వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ‘రౌడీ జనార్ధన్’గా మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.
అధికారికంగా ఈ టైటిల్ కన్ఫామ్ కాలేదు. కానీ, ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిస్తుందీ టైటిల్ అని చెప్పొచ్చు.
Rowdy Vijay Mahanati Keerthy.. ‘రౌడీ’ విజయ్ ఏం చేయబోతున్నాడో కొత్తగా.!
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, మహానటి కీర్తి సురేష్‌తో జత కట్టబోతున్నాడు. రీసెంట్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అతి త్వరలోనే ముంబయ్‌లో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
‘రాజావారు రాణిగారు’ అనే ఓ డీసెంట్ క్లాసిక్ లవ్ స్టోరీతో హిట్ కొట్టిన రవి కిరణ్ కోలా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
‘లైగర్’ సినిమా ఏ ముహూర్తాన చేశాడో ఏమో కానీ, ఆ సినిమాతో తగిలిన దెబ్బ నుంచి విజయ్ కోలుకోలేకపోతున్నాడు. చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ, ఫలించడం లేదు.
గోదారి పల్లె పడుచు వెన్నెల..
‘రౌడీ జనార్ధన్’.. విషయానికి వస్తే, ఇదో రూరల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. లోకల్ పాలిటిక్స్‌ని ఈ సినిమాలో టచ్ చేయబోతున్నారట.
ఈ సినిమా కోసం గోదారి యాసలో విజయ్ దేవరకొండ డైలాగులు చెప్పబోతున్నాడట. మేకోవర్ కూడా డిఫరెంట్‌గా వుండబోతోందనీ తెలుస్తోంది.
ఇక, కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే.. మహానటి అనిపించేసుకుంది ఆల్రెడీ. పాత్ర ఏదైనా సరే, కీర్తి సురేష్‌కి కొట్టిన పిండే.
Also Read: జాన్వీ కపూర్ ‘బ్రాండ్ వాల్యూ’ ఇదీ.!
ఈ సినిమా కోసం అందమైన పల్లె పడుచులా ముస్తాబైపోతోంది కీర్తి సురేష్. ఇది చాలా సింపుల్ కీర్తి సురేష్‌కి. అయినా సరే, పాత్ర కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టాలనుకుంటుంది ఎప్పుడూ కీర్తి సురేష్.
‘దసరా’ సినిమాలో ‘వెన్నెల’ పాత్ర కీర్తి సురేష్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ఈ సినిమాలోనూ తన పాత్ర అందరికీ నచ్చుతుందని అంటున్నారు.
అంతేకాదు, సినిమా కూడా ఆ స్థాయి హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
