Ruhani Sharma HER.. ‘చి.ల.సౌ.’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రుహానీ శర్మ. ఆ తర్వాత పలు సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేసింది.
తెరపై హాట్ అండ్ వైల్డ్ రోల్స్ చేయడమే కాదు, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తోనూ సత్తా చాటగలదు రుహానీ శర్మ.
తాజాగా రుహానీ శర్మ ‘HER’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
Ruhani Sharma HER.. నాని చేతుల మీదుగా..
నేచురల్ స్టార్ నాని ఈ టీజర్‌ని విడుదల చేశాడు. పోలీస్ అధికారి పాత్రలో రుహానీ శర్మ నటిస్తోంది. ఫస్ట్ ఛాప్టర్.. అంటూ టీజర్ వదిలారంటే, ఈ సిరీస్‌లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయన్నమాట.
కనుసైగలతోనే శాసించే పోలీస్ అధికారిగా రుహానీ శర్మ, టీజర్‌లో అదరగొట్టేసింది. ‘రెడ్ టేప్, బ్యూరోక్రసీ, పాలిటిక్స్.. వీటిని అర్థం చేసుకున్నావా.?’ అంటూ ఓ ఉన్నతాధికారి ప్రశ్నిస్తాడు.
‘నేను పోలీస్‌ని అర్థం చేసుకున్నాను.. రాజకీయాల్ని కాదు..’ అంటూ రుహానీ శర్మ చెప్పే డైలాగ్, ఆమె ప్రదర్శించిన ఆటిట్యూడ్.. టీజర్‌కి హైలైట్‌గా మారాయ్.
క్రైమ్ థ్రిల్లర్..
ఇటీవలి కాలంలో క్రైమ్ థ్రిల్లర్స్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, సినిమాగా కంటే ఇలాంటివి వెబ్ సిరీస్‌లుగానే ఎక్కువ బావుంటాయ్.
Also Read: Yummy Rakul.! అందాన్ని తింటోందేమో.!
లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో సత్తా చాటాలని డిసైడ్ అయిన ‘రుహానీ శర్మ’, ఈ ‘హెర్’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.