Home » రుక్మిణి వసంత్ ఆవేదన: ఆ ‘యాంగిల్స్‌’లో ఫొటోలు తీయొద్దు.!

రుక్మిణి వసంత్ ఆవేదన: ఆ ‘యాంగిల్స్‌’లో ఫొటోలు తీయొద్దు.!

by hellomudra
0 comments
Rukmini Vasanth

Rukmini Vasanth Slams Vulgarity.. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన ఫొటోలుకు కొదవే లేదు.

(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఏఐ పుణ్యమా అని, నటీనటుల ఫొటోల్ని అత్యంత అసభ్యకరంగా డిజైన్ చేసి వదులున్నారు సోషల్ మీడియా వేదికగా.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఏఐ సాంకేతిక తప్పుదారి పట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కోర్టుల్ని ఆశ్రయించి, అలాంటివాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడ, మనం చర్చించుకుంటున్నది ఇంకో రకమైన పైత్యం గురించి. సినీ సెలబ్రిటీలు.. అందునా, హీరోయిన్లు.. సినిమా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్య అది.

గ్లామర్ కోసం, హీరోయిన్లు అందమైన కాస్ట్యూమ్స్ ధరిస్తుంటారు.. అవి ఒక్కోసారి వికటిస్తుంటాయ్. చాలీచాలని దుస్తులేసుకుని, సినీ ఫంక్షన్లకు హీరోయిన్లు రావడం కొత్తేమీ కాదు.

అలాంటి సందర్భాల్లో, హీరోయిన్లను అత్యంత అసభ్యకరమైన రీతిలో కొందరు ఫొటోగ్రాఫర్లు చిత్రీకరిస్తుంటారు. ఈ వ్యవహారంపై ఆ మధ్య ఓ హీరోయిన్ అభ్యంతరం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

ఇంకొన్ని సందర్భాల్లో, హీరోయిన్లు పద్ధతిగా వచ్చినా, కొందరు కెమెరాల్లో ఫొటోలు తీసి, తమక్కావాల్సిన విధంగా.. ఆయా హీరోయిన్ల శరీర భాగాల్ని జుగుప్సాకరంగా జూమ్ చేసి, సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు.

ఇదే విషయమై తాజా బాధితురాలు రుక్మిణి వసంత్, సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫొటోలు కొన్నిటిని అసభ్యకరంగా చూపిస్తున్నారంటూ వాపోయింది రుక్మిణి.

రుక్మిణి వసంత్‌కి ఈ విషయంలో బాసతగా నిలిచారు హీరోయిన్లు ఆషిక రంగనాథ్, సప్తమి గౌడ.

నటీమణులుగా తమ వర్క్ గురించి చర్చ జరిగితే బావుంటుందనీ, జుగుప్సాకరమైన ఫొటోల విషయమై చర్చ జరుగుతుండడం దారుణమని ఆషిక, సప్తమి వ్యాఖ్యానించారు.

నిజమే.. ఇది తీవ్రమైన సమస్యే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఈ సమస్యకి పరిష్కారం వుందా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

నైతిక కోణంలో చూస్తే, హీరోయిన్ల శరీర భాగాల్ని అసభ్యకరంగా జూమ్ చేసి పోస్ట్ చేయడం పైశాచికానందమే. కానీ, ఇప్పుడున్న సోషల్ యుగంలో.. అందునా, ఏఐ యుగంలో ఆ పైత్యానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదేమో.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group