Rukshaar Dhillon Forever Valentine.. ప్రేమంటే.? ఇది కూడా ప్రేమేనట.! ఇంతకీ, ఆ ‘ఇది’ అంటే ఏంటి.? ఇక్కడ ‘ఇది’ అంటే, మనుషుల మీదనే కాదు, జంతువుల మీద కూడా చూపించేది.!
ఔను కదా.! అదీ నిజమే.! ప్రేమికుల దినోత్సవం రోజున, అమ్మాయిలూ అబ్బాయిలూ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ విషెస్ చెప్పేసుకున్నారు.
ఖరీదైన బహుమతులూ మూతి ముద్దులూ పొదల్లో వ్యవహారాలూ.. అబ్బో, అదో పెద్ద కథ.! కథ, కాదు వ్యధ.!
Rukshaar Dhillon Forever Valentine.. ఆమె ప్రేమ కాస్త స్పెషల్..
రుక్సార్ ధిల్లాన్ గుర్తుంది కదా.? అదేనండీ, నాని హీరోగా రూపొందిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది రుక్సార్ ధిల్లాన్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలోనూ రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) కనిపించింది.
అంతకు ముందు ‘ఆకతాయి’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.! మొన్నీమధ్యనే అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నా సామి రంగ’ సినిమాలోనూ రుక్సార్ ధిల్లాన్ మెరిసింది.
ప్రేమికుల దినోత్సవం రోజున, అందరికంటే కాస్త భిన్నంగా సోషల్ మీడియాలో రుక్సార్ ధిల్లాన్ పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.

తన పెంపుడు కుక్కతో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘ఫరెవర్ వాలెంటైన్’ అంటూ పేర్కొంది రుక్సార్ ధిల్లాన్ (Rukshaar Dhillon).
కాస్త వెరైటీగా వుంది కదూ.! వుంటుంది మరి.! రుక్సార్ మాత్రమే కాదు, ఇంకొంతమంది అందాల భామలూ, కొందరు హీరోలూ ఇలా పెంపుడు జంతువులపై తమ ప్రేమను వాలెంటైన్స్ డే రోజున చాటుకున్నారు.