Rukshar Dhillon.. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటాడో సినిమాలో హీరో.! చంపకపోతే ఎలా.?
చుకత్తుల్లాంటి కళ్ళు అమ్మాయిలకు వున్నదే, కుర్రాళ్ళ గుండెల్లో తియ్యగా గుచ్చెయ్యడానికి.!
‘కృష్ణార్జున యుద్దం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రుక్సార్ థిల్లాన్. తొలి సినిమాకే క్యూట్ అప్పీల్‌తో కట్టి పడేసింది.
హిట్టు కూడా కొట్టింది. కానీ, అరుదుగా మాత్రమే అవకాశాలు దక్కించుకుంటోంది. హీరోయిన్‌గా తొలి అడుగులు కన్నడ సినిమాతో వేసింది అందాల రుక్సార్.
ఆ తర్వాత తెలుగులో నాని సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. అల్లు శిరీష్‌తో ‘ఏబీసీడీ’ సినిమాలో నటించింది. ఆశించిన రిజల్ట్ అందుకోలేదు.
Rukshar Dhillon తల్వార్ చూపుల్తో హీటెక్కిస్తోందిగా.!
రీసెంట్‌గా ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమాతో కాంట్రవర్సీ హీరో విశ్వక్ సేన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాతో ఒకింత ఫర్వాలేదనిపించుకుంది.

భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీలోనూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రుక్సార్ థిల్లాన్, , మంచి నటి అనిపించుకోవాలనుందని చెబుతోంది.
అందుకే ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అన్నట్లు పాపలో గ్లామర్ పాళ్లు కూడా కూసింత ఎక్కువేనండోయ్.
సమ్‌థింగ్ స్పెషల్..
సోషల్ మీడియా వేదికగా గ్లామర్ సెగలు రేపుతుంటుంది. తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్స్‌లో రుక్సార్ చేస్తున్న గ్లామర్ హల్‌చల్‌కి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.
Also Read: Urfi Javed Kangana Ranaut: గ్లామరూ.! వల్గరూ.!
అన్నట్లు ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన రుక్సార్ థిల్లాన్ ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్ చేయడం ఎలాగో తనకు బాగా తెలుసంటోంది.
అందుకే అప్పుడప్పుడూ కనిపించినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా కనిపించినప్పుడే తన ఐడెంటిటీ స్పెషల్‌గా వుంటుందని క్యూట్ క్యూట్‌గా చెప్పేస్తోంది రుక్సార్ థిల్లాన్.