Sai Durga Tej.. సాయి ధరమ్ తేజ్ కాస్తా సాయి తేజ్ అయ్యాడు.! ఇప్పుడేమో ఆ సాయి.. తేజ్.. ఈ రెండు పదాల మధ్యా ‘దుర్గ’ వచ్చి చేరింది.!
అంతే కాదు, విజయ దుర్గ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించేశాడు సాయి ధరమ్ తేజ్.! చాలా చాలా కొత్త మార్పులే సుమీ ఇవన్నీ.!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ‘అమ్మ కోసం పేరు మార్చుకున్నాను..’ అంటూ తాజాగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Sai Durga Tej.. పేరు.. సెంటిమెంటు.!
పేరులో ఏముంది.? ఏమీ లేకపోవడమేంటి.? చాలా చాలా వుంటుంది.! కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ ఎందుకు అయినట్టు.? కొణిదెల శివ శంకర వరప్రసాద్ కాస్తా చిరంజీవి ఎందుకు అయినట్లు.?
స్క్రీన్ నేమ్స్ ఇలా డిఫరెంట్‌గా వుండటం అనేది కొత్త విషయం కాదు. రామ్ చరణ్ పూర్తి పేరులోని ‘తేజ’ని కట్ చేసేశారెప్పుడో.!

పేర్లలో అక్షరాలు మారుతుంటాయి, పేర్లూ మారిపోతుంటాయి.! న్యూమరాలజీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేసుకుంటుంటారు తమ పేర్లకి సెలబ్రిటీలు.
అయితే, సాయి ధరమ్ తేజ్ మాత్రం, అమ్మ కోసం పేరు మార్చుకున్నట్లు చెబుతున్నాడు. తన తల్లి ‘దుర్గ’ పేరు కలిసొచ్చేలా, సాయి దుర్గ తేజ్.. అని మార్చుకున్నట్లు చెప్పాడు.
కొత్త నిర్మాణ సంస్థ కూడా..
విజయ దుర్గ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు సాయి దుర్గ తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్.
మేనమామలు చిరంజీవి, నాగబాబు ఆశీర్వాదాల్ని ఇప్పటికే తీసుకుని, నిర్మాతగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
Also Read: అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.! బోల్తా కొట్టిందిలే.!
రేపో మాపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (సాయి ధరమ్ తేజ్‌కి చిన మావయ్య) ఆశీస్సుల్ని కూడా తీసుకోనున్నాడట.
కొత్త సినిమాలే నిర్మిస్తాడో, కొత్త కొత్తగా వెబ్ సిరీస్‌లను తన కొత్త బ్యానర్‌లో షురూ చేస్తాడోగానీ, పేరు మార్చుకున్నాక ఈ మెగా మేనల్లుడికి టైమ్ మరింత కలిసి రావాలని ఆశిద్దాం.