Sai Pallavi Bikini Sensation.. సాయి పల్లవి అంటే, అత్యద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్.! అలాగని, సినిమాల్లో గ్లామర్ పండించదా.? అంటే, హద్దులు దాటని గ్లామర్ సాయి పల్లవి ప్రత్యేకత.
తాజాగా, సోషల్ మీడియాలో కొన్ని పొటోలు వైరల్ అయ్యాయి. అవి, సాయి పల్లవి వెకేషన్‌కి సంబంధించినవి. వెకేషన్‌లో, సాయి పల్లవి సముద్ర తీర అందాల్ని ఎంజాయ్ చేస్తోంది.
సహజంగానే, సముద్ర తీరం.. అంటే, స్విమ్ సూట్.. అదే, బికినీ తప్పనిసరి.. అవుతుంటుంది. చీర కట్టుకుని స్విమ్మింగ్ చేయలేరు కదా.!
Sai Pallavi Bikini Sensation.. తానేనని క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి..
అయితే, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలంటూ, సోషల్ మీడియాలో ఇంకో ట్రెండ్ షురూ అయ్యింది. ఈ మధ్య ఏది ఒరిజినల్ ఫొటోనో, ఏది ఏఐ జనరేటెడ్ ఫొటోనో తెలుసుకోవడం కష్టమవుతోంది.
కానీ, సాయి పల్లవి ఈ సస్పెన్స్‌కి తెరదించింది. ఆ ఫొటోల్లో వున్నది తానేననీ, అదంతా రియల్ అనీ, ఏఐ జనరేటెడ్ కాదనీ సాయి పల్లవి స్పష్టతనిచ్చింది.
దాంతో, ఇంకోసారి సాయి పల్లవి బికినీ – స్విమ్ సూట్ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వాటిపైన మళ్ళీ కామెంట్లు.. అదంతా వేరే వ్యవహారం.
ఫొటోల్లో.. వింతేముంది.?
ముందే చెప్పుకున్నట్లు.. వెకేషన్‌లో ఎంజాయ్ చేయడం అనేది సర్వసాధారణం. స్విమ్మింగ్, చీరతో చెయ్యలేరు కదా.! పైగా, ఏ దుస్తులు ధరించాలన్నది, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం.
అయినా, సాయి పల్లవి అంటే, కొందరికి అదో ఇది.! సాయి పల్లవి మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయ్.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోల ట్రెండ్ వచ్చాక.. వాటితో, సాయి పల్లవిని అత్యంత జుగుప్సాకరంగా చూపించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లోనే కాదు, హిందీలోనూ సాయి పల్లవి సినిమాలు చేస్తోంది. నటిగా, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి.
