Sai Pallavi BollyWood Entry.. లేడీ పవర్ స్టార్ అని టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనదైన పాపులారిటీ దక్కించుకుంది.
అయితే, ఇటీవల సాయి పల్లవి సినిమాలకు కాస్త దూరంగా వుంది. ‘భోళా శంకర్’ సినిమాలో సాయి పల్లవి నటించాల్సి వుండగా, రీమేక్ సినిమా అని ఆ ఛాన్స్ సాయి పల్లవి వదులుకున్న సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
Sai Pallavi BollyWood Entry.. కరెక్ట్ సబ్జెక్ట్ దొరికినట్లేనా.!
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘లవ్ స్టోరీ’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారట. ఈ సినిమా ఒరిజినల్‌లో సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో మంచి హిట్ అందుకుందీ సినిమా. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్ చేయబోతున్నారట.
మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్ ఈ సినిమాలో మేల్ లీడ్ పోషించబోతున్నాడట.
ఈ సినిమాతోనే సాయి పల్లవి (Sai Pallavi) బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోందనీ తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పుడీ టాపిక్ హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతోంది.
తెలుగులో ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ నత్త నడకనే సాగుతోంది. అప్‌కోర్స్.! సాయి పల్లవి (Sai Pallavi) ఒప్పుకోవాలి కానీ, ఆమెకు ఆఫర్లకేం కొదవ వుండదు.
కానీ, అన్ని రకాల ప్రాజెక్టుల్నీ సాయి పల్లవి టేకప్ చేయదు. కథ నచ్చాలి. ఆ కథలో తన పాత్రకు ప్రాణం పెట్టేంత ప్రాధాన్యత వుండాలి. అప్పుడే ఆ ప్రాజెక్ట్‌కి సైన్ చేస్తుంది.
Also Read: మీనాక్షి చౌదరికి ప్రమోషన్ అట కదా.!
ఆల్రెడీ తెలుగులో హిట్ అయిన సబ్జెక్ట్, తనకు అలవాటైన పాత్ర కావడంతో అన్నీ ఆలోచించే ఈ సినిమాకి సైన్ చేసి వుండొచ్చు సాయి పల్లవి. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.