నటనలో వంక పెట్టలేం. డాన్సుల్లో అయితే ఆమె (Sai Pallavi Remuneration Gossips) తర్వాతే ఎవరైనా. ఏ పాత్రలో అయినా చాలా తేలిగ్గా ఒదిగిపోతుంది. ఆమె కోసం ఎక్కువగా మేకప్ అవసరం లేదు. ఎందుకంటే, అసలామెకు మేకప్ అంటే పెద్దగా ఇష్టం వుండదు.
కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఆమె చాలా సింపుల్‌గానే ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. కానీ, రెమ్యునరేషన్ విషయంలోనే ప్రతిసారీ ఆమె చుట్టూ చాలా పుకార్లు వివాదాస్పద రీతిలో షికార్లు చేసేస్తుంటాయి.
ఆమె ఇంకెవరో కాదు, సాయి పల్లవి. తొలి సినిమా ‘ఫిదా’ దగ్గరనుంచి ఇప్పటిదాకా.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయేమోగానీ, నటిగా ఆమె ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. అదీ ఆమె ప్రత్యేకత.
డెడికేషన్‌కి కేరాఫ్ అడ్రస్. ఇంత డెడికేషన్ చూపించే, ఇంత కమిటెడ్‌గా సినిమాలు చేసే సాయి పల్లవి రెమ్యనరేషన్ విషయంలో మాత్రం ఎందుకు ‘అల్లరి’ చేస్తుంది.? ఏమోగానీ, ఆమె చుట్టూ ఈ రెమ్యనరేషన్ పుకార్లు మాత్రం వైఫైలా చక్కర్లు కొడుతూనే వుంటాయి.
ఈ విషయమై పలు సందర్భాల్లో సాయి పల్లవి ఘాటుగా స్పందించినా, పుకార్లు ఆగడంలేదు. ‘నా రెమ్యునరేషన్ గురించి నా నిర్మాత ఆలోచించుకుంటారు. నా స్థాయికి మించి నేను రెమ్యునరేషన్ అడిగినా, నిర్మాత ఇవ్వరు కదా.?’ అని ఓ సందర్భంలో సాయి పల్లవి ఘాటైన ప్రశ్న సంధించింది.
అదీ నిజమే మరి. ‘లవ్ స్టోరీ’ సినిమాకీ, ‘విరాటపర్వం’ సినిమాకి కూడా సాయి పల్లవిపై రెమ్యునరేషన్ గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విషయంలోనూ సాయి పల్లవి మీద ‘రెమ్యునరేషన్ బాంబు’ పేల్చేశారు కొందరు.
నిజానికి, ఈ గాసిప్స్‌తో ఆమెకు సంబంధం లేకపోయినా, కొన్నిసార్లు ఈ పుకార్ల కారణంగా ఆమెను అప్రోచ్ అయ్యేందుకూ కొందరు నిర్మాతలు వెనుకడగు వేస్తున్నారట.
ఇదంతా సాయి పల్లవికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర.. అన్నది ఆమె అభిమానుల ఆరోపణ. సాయిపల్లవికి (Sai Pallavi Remuneration Gossips) తెలుగులోనే కాదు, తమిళంలోనూ, మలయాళంలోనూ బోల్డంతమంది అభిమానులున్న విషయం తెలిసిందే కదా.