Salaar Teaser Prabhas.. ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో ‘సలార్’ కూడా ఒకటి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ‘సలార్’.
‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచినా, ‘ఆదిపురుష్’ అంచనాల్ని అందుకోలేకపోయినా, ప్రభాస్ నుంచి వస్తోన్న ‘సలార్’పై అంచనాలు మాత్రం.. అనూహ్యంగా క్రియేట్ అయ్యాయి.!
కోవిడ్ సహా అనేక కారణాలతో ‘సలార్’ సినిమా షూటింగ్ అలా అలా సాగుతూ వచ్చింది. ఎట్టకేలకు, సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది..
Salaar Teaser Prabhas.. టీజర్ అదరహో..
రొటీన్‌కి భిన్నంగా ‘సలార్’ టీజర్‌ని ఈ రోజు తెల్లవారు ఝామున.. అంటే, జులై 6న ఉదయం 5 గంటల సమయంలో విడుదల చేశారు.
ఓ కొత్త సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎలా రాత్రంతా ఎదురుచూస్తారో, అలా నిద్రపోకుండా ‘సలార్’ టీజర్ కోసం ఎదురుచూశారు.
అభిమానుల ఎదురుచూపులు.. వారి అంచనాలకు తగ్గట్టుగానే ‘సలార్’ టీజర్‌ని వదిలారు. కంటెంటున్నోడి కటౌట్‌ని టీజర్‌లో ‘సలార్’ టీమ్ పరిచయం చేసింది.

ప్రభాస్ రూపం సరిగ్గా కనిపించకుండా, ప్రశాంత్ నీల్ తన ట్రేడ్ మార్క్ టోన్‌లో ఈ టీజర్‌ని కట్ చేయించాడు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. వేరే లెవల్..
ప్రశాంత్ నీల్ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ‘సలార్’ (Salaar The Saga) కూడా అంతే.
ఆ టోన్.. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. వెరసి, మరో ‘కేజీఎఫ్’.. కాదు కాదు, అంతకు మించి అన్నట్టుగా ‘సలార్’పై అంచనాలు పెరిగేలా చేశాయ్.
Also Read: Bholaa Shankar Teaser: ఏపీ, తెలంగాణ.. రెండూ నావే.!
సింపుల్ ఇంగ్లీష్.. అంటూ, లయన్.. టైగర్.. జురాసిక్ పార్క్.. ఇలా ఇంగ్లీషులోనే డైలాగ్ నడిపించేశారు.
అంచనాలు ఎన్నయినా పెట్టుకోండి.. ఈసారి పాన్ ఇండియా కాదు.. అంతకు మించి.. గ్లోబల్ తెరపై.. మన ఇండియన్ సినిమా మరోమారు సత్తా చాటబోతోంది.. ‘సలార్’ రూపంలో.