Salman Khan Pooja Hegde Dance.. సల్మాన్ ఖాన్ అంటేనే మాస్.. ఊర మాస్.! యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఎలా చెలరేగిపోతాడో.. కామెడీ పండించే సన్నివేశాల్లోనూ అంతే. ‘కిక్’ సినిమా కోసం జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌తో (Jacqueline Fernandez) చేసిన పాట గుర్తుందా.? అదే పాటని, పూజా హెగ్దేతో కలిసి చేసేశాడు.. అయితే, సినిమా కోసం కాదు.. ఓ ఈవెంట్ కోసం.
సల్మాన్ ఖాన్ చిలిపితనం సంగతి అందరికీ తెలిసిందే కదా.! కామెడీ కోసం ఆ చిలిపితనాన్ని భలేగా వాడేస్తుంటాడు. కాదు కాదు, కొరియోగ్రాఫర్లు సల్మాన్ ఖాన్‌ని బాగా వాడేస్తుంటారు.. సల్మాన్ ఖాన్‌లోని కామెడీ టైమ్‌ని చక్కగా ఉపయోగించేసుకుంటుంటారు.
Salman Khan Pooja Hegde Dance.. బుట్టబొమ్మతో సల్లూభాయ్ డాన్స్..
పూజా హెగ్దే, సల్మాన్ ఖాన్.. సందడి సందడిగా డాన్స్ చేసేశారు దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో. సల్లూభాయ్, బుట్టబొమ్మ.. వేదికపై అద్భుతంగా డాన్స్ చేస్తోంటే.. అది చూసేవారికి కన్నులపండువ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
పాట ప్లే అవుతోంది.. పూజా హెగ్దే, సల్మాన్ ఖాన్ డాన్సులేస్తున్నారు.. ఇంతలో డాన్స్ మూమెంట్‌లో భాగంగా, పూజా హెగ్దే డ్రెస్ వైపు చూశాడు. ఒరిజినల్ పాటలో జాక్వెలైన్ పొడుగాటి షర్టు ధరిస్తుంది.. ఇక్కడేమో పూజా హెగ్దే బాడీ టైట్ డ్రస్సు వేసింది.
చిలిపి కథానాయకుడు సల్మాన్ ఖాన్..
దాంతో, ఏం పట్టుకుని లాగాలి.? అన్నట్టుగా ఓ లుక్ పెట్టాడు డాన్స్ చేస్తూనే సల్మాన్ ఖాన్ (Salman Khan). అంతే, పూజా హెగ్దే (Pooja Hegde) కూడా చిరునవ్వులు చిందిస్తూ సిగ్గులొలికించింది.
ఎంతైనా సల్మాన్ ఖాన్ చిలిపితనం లెక్కే వేరు. అసభ్యతకు అస్సలేమాత్రం తావివ్వకుండా చిలిపి చిలిపిగా వేదికపై సందడి చేసి, అందరనీ ఆశ్చర్యపరిచాడు, ఆనందపరిచాడు. అన్నట్టు సల్మాన్ ఖాన్‌తో పూజా హెగ్దే బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.