Samantha Akkineni Naga Chaitanya Divorce Gossips అక్కినేని నాగచైతన్య, సమంత.. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అలా సమంత రూత్ ప్రభు కాస్తా, సమంత అక్కినేని అయ్యింది. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సమంత, తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ‘సమంత అక్కినేని’ అనే పేరు తీసేసి, జస్ట్ ‘ఎస్’ అని మాత్రమే పెట్టుకోవడంతో ఈ రచ్చ షురూ అయ్యింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతను ఇదే విషయమై ప్రశ్నిస్తే, ఆ అంశంపై స్పందించాల్సిన అవసరం లేదని సమంత లైట్ తీసుకుంది. ఇదిలా వుంటే, సమంత – చైతన్య మధ్య విడాకుల కోసం ఒప్పందాలు జరిగాయనీ, 250 కోట్ల రూపాయల మేర, సమంతకు వివిధ రూపాల్లో చెల్లింపులు చేయడానికి చైతూ ముందుకొచ్చాడనీ.. మీడియాలో కుప్పలు తెప్పలుగా ఊహాగానాలు షురూ అయ్యాయి.
మరోపక్క, అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ ప్రోమో సోషల్ మీడియా విడుదలైతే, చైతూ ట్వీట్ మీద స్పందించిన సమంత, ‘విన్నర్’ అంటూ విషెస్ చెప్పింది. అయితే, అందులో సాయి పల్లవి పేరు ప్రస్తావించింది తప్ప, చైతూ పేరు ప్రస్తావించలేదు సమంత.. అంటూ కొత్త వివాదం రాజుకుంది. సమంత, చైతూ ట్వీటుపై స్పందించినప్పుడు, మళ్ళీ చైతూ పేరెందుకు ట్యాగ్ చెయ్యాలన్నది ఇంకొందరి వాదన.
కాగా, సమంత తన సినిమాకి ‘విన్నర్’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై స్పందించన చైతూ, ‘థ్యాంక్యూ సామ్’ అని కృతజ్ఞతలు తెలిపాడు. సో, ఇద్దరి మధ్యా విభేదాలున్నాయని అనుకోవడానికి వీల్లేదన్నమాట.
ఇక, విడాకుల గాసిప్స్ అంటారా.. ఆ పరిస్థితే వుంటే.. ఇటు సమంత అయినా, అటు నాగచైతన్య (Samantha Akkineni Naga Chaitanya Divorce) అయినా.. మొహమాటపడటానికీ, దాచేయడానికీ ఏమీ వుండదు కదా.? అయినాగానీ, ఎడా పెడా దూసుకొస్తున్న గాసిప్స్ నేపథ్యంలో సమంత కావొచ్చు, నాగచైతన్య కావొచ్చు.. వీటిపై స్పందిస్తే.. అభిమానులకు అది కాస్త ఊరటగా వుంటుందేమో.