Samantha Ruth Prabhu Kushi.. సినీ నటి సమంత క్షమాపణ చెప్పింది.! క్షమాపణ చెప్పేంత తప్పు ఆమె ఏం చేసింది.? నిజంగానే తప్పు చేసింది. కావాలని చేసిన తప్పు కాదది.!
అసలు విషయమేంటంటే, సమంత – విజయ్ దేవరకొండ కాంబినేసన్లో ‘ఖుషీ’ పేరుతో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే, మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య కారణంగా కొంతకాలం పాటు సమంత సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది.
Samantha Ruth Prabhu Kushi.. కోలుకుందిగానీ..
సమంత ప్రస్తుతం కోలుకుంది. మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ‘శాకుంతలం’ విడుదల కాబోతోంది. ఇంకోపక్క అమెజాన్ తెరకెక్కిస్తోన్న ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.
ఈ క్రమంలోనే ‘ఖుసీ’ సినిమా ఆలస్యమయ్యింది. ‘ఖుసీ’ సంగతేంటి.? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే, ‘త్వరలో..’ అంటూ సమాధానమిచ్చింది సమంత.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణ చెప్పింది. ‘ఖుషీ’ షూటింగ్ త్వరలో పునఃప్రారంభమవుతుందనీ పేర్కొంది సమంత.
విజయ్ దేవరకొండకే బిగ్ ఎఫెక్ట్..
‘లైగర్’ ఫ్లాప్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మీద చాలా పెద్ద పిడుగు పడింది. దాన్నుంచి కోలుకోవాలంటే, వెంటనే ఇంకో సినిమాని విజయ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
కానీ, సమంత కారణంగా ‘ఖుషీ’ ఆలస్యమయ్యింది. అందుకే, విజయ్ అభిమానుల ఆవేదనని అర్థం చేసుకున్న సమంత, తన వల్ల జరుగుతున్న ఆలస్యానికి క్షమాపణ చెప్పింది.
సమంత వల్ల విజయ్ సినిమా ‘ఖుషీ’ ఆగిపోయిందంటూ రౌడీస్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్కి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో.!