Samantha Ruth Prabhu.. సోషల్, మీడియా, వెబ్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా.. అన్నింటా సమంత పేరు మార్మోగిపోతోంది.! కారణం, ఆమె నటిస్తోన్న సినిమా గురించి కాదు.!
ఎప్పుడో జరిగిపోయిన సమంత – నాగచైతన్యల విడాకుల వ్యవహారం గురించి కూడా కాదిక్కడ చర్చ.! సమంతకి తీవ్ర అనారోగ్యం సంభవించింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది.
మయోసైటిస్ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. వైద్య చికిత్స తీసుకుంటున్నానని పేర్కొంటూ ఈ మేరకు ఫొటోని కూడా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది సమంత.
మరీ అంత ప్రాణాంతకమైనదా.?
ఇదిగో పులి.. అంటే, అదిగో తోక.. అనే నైజం మనది.! జలుబు చేస్తే ప్రాణాలు పోతున్న రోజులివి. క్యాన్సర్ సోకినా బతుకుతున్న రోజులివి. మయోసైటిస్ అనే ఓ ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా ప్రాణాలు పోతాయా.?
ఏమో, కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు కూడానట. క్యాన్సర్‌గా ఈ సమస్య మారే అవకాశం కూడా వుంటుందట. వైద్య పరిభాషలో చాలా చెబుతారు.

పైగా, ఇది ఇంటర్నెట్ యుగం. సాధారణ తలనొప్పి గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే.. బ్రెయిన్ ట్యూమర్ గురించి కూడా అందులో ప్రస్తావన వుండొచ్చు.. అలాంటి కంటెంట్ దొరుకుతోంది ఇంటర్నెట్‌లో.
Samantha Ruth Prabhu.. ఫైటర్ సమంత..
చాలాకాలం క్రితమే మణిరత్నం సినిమాలో సమంత నటించాల్సి వుండగా.. అప్పుడేదో అనారోగ్య సమస్య కారణంగా ఆ సినిమాని సమంత వదులుకుందన్న ప్రచారం జరిగింది.
అదే.. ఆ సమస్యే ఇది.. అంటూ కొందరు చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే, మయోసైటిస్‌కి వైద్య చికిత్స వుంది. ప్రస్తుతం సమంత ఆ చికిత్స తీసుకుంటోంది కూడా.
Also Read: Nayanthara Vignesh Shivan.! ట్విన్స్, వయా సరోగసీ.!
త్వరలోనే రెట్టించిన ఉత్సాహంతో అందరి ముందుకూ వస్తానని సమంత చెబుతోంది. అన్నట్టు, సమంత తాజా చిత్రం ‘యశోద’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
సినిమాల్లో వీరోచిత పోరాటాలే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సమంత పరిస్థితులతో ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే వుంది. పోరాటం ఆమెకు కొత్త కాదు.!
ఇప్పుడీ మయోసైటిస్‌తో పోరాటంలోనూ ఆమె విజేతగా నిలుస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాలు అనవసరం.