చిన్న బ్రేక్.. సమంత (Samantha Ruth Prabhu) ఈజ్ బ్యాక్.! సోషల్ మీడియా నుంచి సెలబ్రిటీలు శాశ్వతంగానో, తాత్కాలికంగానో బ్రేక్ తీసుకోవడం సర్వసాధారణం.
నిజానికి, సెలబ్రిటీల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని ఎవరో మెయిన్‌టెయిన్ చేస్తుంటారు తప్ప, సెలబ్రిటీలే వాటిల్లో పోస్టులు పెడతారని అనుకోలేం.
సరే, సమంత ఎందుకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం పాటు ‘బ్రేక్’ తీసుకుంది.? అన్నది వేరే చర్చ. అది ఆమె ఇష్టం.
వండి వడ్డించేశారంతే..
ఈలోగా పుకార్లు షికార్లు చేసేశాయ్.! ఏడ్చి ఛస్తున్నట్టున్నారు.. అనుకుందో ఏమోగానీ, ఓ పోస్టు పడేసింది. దాంతో, పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వడ్డించబడ్డాయి వెబ్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ.!

సమంత ఓ టీ-షర్ట్ ధరించింది.. అలా ఓ ఫొటోకి పోజిచ్చి, ఆ ఫొటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ టీ-షర్ట్ మీదున్న కొటేషన్‌ని విడిగా పేర్కొంది ఆ పోస్టులో. అంతే, సమంతకి కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికాడంటూ కథనాలు షురూ అయ్యాయ్.
Samantha Ruth Prabhu.. ఔనా, సమంత అలా చేస్తోందా.?
సమంత మళ్ళీ ప్రేమలో పడింది.. సమంత మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందంటూ గాసిప్స్ గుస్సుమన్నాయ్. ముందే చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వంటకాలని.
ఒంటరిగా ప్రయాణం చెయ్యలేవ్.. అన్నది సమంత పోస్ట్ చేసిన కొటేషన్ సారాంశం. దాని అసలు అర్థమేంటి.? అన్నది వేరే చర్చ.
తన గురించి అందరూ మాట్లాడుకోవాలని అనుకునే వుంటుంది సమంత.. అందుకే, అలాంటి పోస్ట్ పెట్టి వుండాలి.! ఆమె అనుకున్నది జరిగింది కూడా.!
Also Read: Anasuya Bharadwaj ‘నవస్త్ర’.. అసలు అర్థం తెలుసా.!
ఎప్పుడు ఎలాంటి స్టంట్లు చేస్తే, ఎలాంటి పబ్లిసిటీ వస్తుందో సమంతకి బాగా తెలుసు. ఇన్నేళ్ళ కెరీర్‌లో ఆమాత్రం అనుభవం ఆమెకు వచ్చి వుండదా.?
ఈ పైత్యపు మీడియా వంటకాల సంగతి పక్కన పెడితే, సమంతకి మళ్ళీ పెళ్ళి చేసుకునే హక్కు వుంది. అసలు పెళ్ళితో పనేంటి.? ఎంచక్కా డేటింగ్ చేయాలనుకున్నా ఆమె నిశ్చింతగా చేసుకోవచ్చు.
ప్రస్తుతానికైతే సమంత తన తదుపరి సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీగా వుంది. కెరీర్ పరంగా సమంతకి ఇప్పుడేమీ ఢోకా లేదు.! పర్సనల్ లైఫ్ అంటారా, అది ఆమె ఇష్టం.