Table of Contents
Samantha Ruth Prabhu Tattoo.. చక్కనమ్మ చిక్కినా అందమే.. అంటాడో కవి.
చక్కనమ్మ ఏం చేప్పినా అది హాట్ టాపిక్ అవుతూనే వుంటుందన్నది నేటిమాట. అది వివాదాస్పదమవుతుందా.? లేదంటే, అందర్నీ ఆకట్టుకునే అంశం అవుతుందా.? అన్నది వేరే చర్చ.
అసలు విషయంలోకి వస్తే, నాగచైతన్యతో విడాకుల తర్వాత.. సమంత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తోంది సోషల్ మీడియా వేదికగా.
ఏవేవో చెబుతోంది.. వాటన్నిటినీ నాగచైతన్యకు లింక్ చేయడంలో ఇరువురి అభిమానులూ ఎప్పుడూ పోటీపడుతూనే వున్నారు.
సమంత సాధారణంగా చెప్పే విషయాలూ ప్రచార విన్యాసాలుగానే మారుతున్నాయి.
పియర్సింగ్.. టాట్టూ.! అసలు వ్యధ.!
తాజాగా సమంత (Samantha Ruth Prabhu) సోషల్ మీడియా ద్వారా అభిమానులు సంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో ‘పియర్సింగ్’, ‘టాట్టూ’ అనే అంశాల గురించి రెండు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సమంత.
టాట్టూ.. అదేనండీ పచ్చబొట్టు అస్సలు వేసుకోవద్దంటూ సమంత సలహా ఇచ్చింది. ఎందుకు.? అంటే, దానికైతే ప్రస్తుతానికి సమంత నుండి సమాధానం రాలేదు.
సమంత శరీరంపై కొన్ని చోట్ల టాట్టూలున్నాయి. వాటిల్లో తొలి సినిమా ‘ఏ మాయ చేశావె’ గుర్తుకొచ్చేలా ఓ టాటూ వుంది.
ఇంకోటి అక్కినేని నాగచైతన్య పేరు గుర్తుకొచ్చేలా డిజైన్ చేయించబడిన ‘చే’ అనే పదం. వీటితోపాటుగా, ఇంకో టాట్టూ కూడా వుంది.
Samantha Ruth Prabhu Tattoo పచ్చబొట్టూ చెరిగిపోతుందిలే.!
పచ్చబొట్టూ చెరిగిపోదులే.. అని ఓ పాత తెలుగు సినిమాలో పాట వుంది. కానీ, పచ్చబొట్టు ఇప్పుడు చెరిగిపోతోంది కూడా.
దానికి రకరకాల పద్ధతులు అందుబాటులో వున్నాయి. ఒకప్పుడు పరిస్థితి వేరు. ఒక్కసారి పచ్చబొట్టు వేయించుకుంటే, చచ్చేదాకా పోయేది కాదది.

అప్పట్లో బంధాలు అలాంటివి. అప్పుడంత ‘పద్ధతి’ ఇప్పుడెక్కడుంది.? దేవుళ్ళ పేర్లతో వేయించుకునే టాట్టూలు, మతం మార్చుకోవడంతోనే మాయమైపోతున్నాయి.
ప్రేమించినోళ్ళు, పెళ్ళి చేసుకున్నోళ్ళ టాట్టూలు చెరిగిపోవడానికి పెద్దగా సమయం పట్టడంలేదు.
కష్టమైనా ఇష్టంగానే.!
ఇదిలా వుంటే, సమంత చెవికి ఓ ‘పియర్సింగ్’ వుంటుంది. దాని కారణంగా ఆరు నెలలపాటు నొప్పి భరించాల్సి వచ్చిందట.
పెదాలకీ, కనుబొమల పక్కన, బొడ్డుకీ.. పియర్సింగ్ చేసుకోవడం ఇటీవలి కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ‘ప్రైవేట్ పార్ట్స్’కి కూడా ఈ పియర్సింగ్ చేసేస్తున్నారు.
Also Read: Priyanka Jawalkar.. కిరికెట్టూ.. కనికట్టూ ఏంటో ఆ సీక్రెట్టూ.!
ఇదొక ఆర్ట్ అనాలా.? పైత్యమనాలా.? ఎవరన్నా ఏదన్నా అనుకోండి. నరకయాతన అనుభవిస్తూనే.. పియర్సింగ్ చేయించేసుకుంటున్నారు చాలామంది.
Samantha Ruth Prabhu Tattoo ఉచిత సలహానేగానీ.!
మొత్తమ్మీద, సమంత రెండు విషయాలపై ‘ఉచిత సలహా’ ఇచ్చేసింది. కానీ, ఆ సలహా మంచిదే.
పచ్చబొట్టు, పియర్సింగ్ వల్ల పడ్డ ఇబ్బందులేంటో సమంత స్వయంగా రుచి చూసింది గనుక.. ఎవరన్నా వాటి వైపు వెళ్ళకపోవడమే మంచిదేమో.!