Samantha Ruth Prabhu Taapsee..అందాల భామలైతేనేం, నిర్మాణ రంగంలో ఎందుకు రాణించకూడదు.? గతంలో చాలామంది అందాల భామలు నిర్మాతలుగా సత్తా చాటారు.
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.! నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన హీరోయిన్ల లిస్టులో తాప్సీ కూడా చేరిపోయింది. తాజాగా, తాప్సీ ఓ సినిమా నిర్మించబోతోంది.
సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్న తాప్సీ, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన చేయబోతోందిట.
Samantha Ruth Prabhu Taapsee హీరోయిన్ సెంట్రిక్ మూవీయేనా.?
వెండితెరపై ఎన్నో సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసిన తాప్సీ, కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాలేదు.. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చాలానే చేసింది.

ఆ మాటకొస్తే, గ్లామరస్ పాత్రల కంటే, యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలే తాప్సీకి (Taapsee Pannu) ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టాయి కూడా.
‘హీరోల రెమ్యునరేషన్లో పదో వంతు ఖర్చు చేస్తే చాలు, చాలా చాలా మంచి సినిమాలొచ్చేస్తాయ్..’ అని చెబుతుంటుంది తాప్సీ (Taapsee).
లేడీ సూపర్ స్టార్ సమంత.!
అందుకేనేమో, తాను నిర్మాతగా రూపొందించబోయే సినిమాకి, సమంతని ఎంచుకున్నట్టుంది తాప్సీ (Taapsee Pannu). అయినా, సమంతతో సినిమా అంటే మామూలుగా వుండదు.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
ఎందుకంటే, సమంత (Samantha Prabhu) రెమ్యునరేషన్ కూడా ఓ మోస్తరు హీరోల రెమ్యునరేషన్‌తో దాదాపు సమానమే అయిపోయింది ఇటీవలి కాలంలో.
ఎలాగైతేనేం, లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగే క్రమంలో తాప్సీ ద్వారా సమంతకి (Samantha Ruth Prabhu) ఇదో కొత్త అవకాశంగానే భావించాలేమో.!
సమంత చేతిలో ప్రస్తుతం వున్న సినిమాల్నే తీసుకుంటే, దాదాపు అన్నీ లేడీ ఓరియెంటెడ్ కథాంశాలే. అది ‘శాకుంతలం’ (Shakuntalam) అయినా, ‘యశోద’ (Yashoda) అయినా.
విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) కలిసి సమంత చేస్తున్న సినిమా ‘ఖుషీ’ (Kushi) కూడా సమ్‌థింగ్ స్పెషల్.. అన్నట్లుగానే కనిపిస్తోంది.