Samantha Ruth Prabhu.. అసలామెకి ఏమయ్యింది.? ఈ మయోసైటిస్ ఏంటి ఏంటి.? ఇలా రీసెర్చ్ చేసేస్తున్నారు సమంత అభిమానులు.!
ఎప్పటినుంచి ఆ సమస్య వుందోగానీ, ఇటీవల సమంత తన అనారోగ్య సమస్య గురించి బయటపెట్టేసరికి అంతా అవాక్కయ్యారు.
ఓ వైపు ‘యశోద’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోపక్క, సమంత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చిన్న సమస్య కాదిది.. నిజానికి పెద్ద సమస్యే.
సమంత.. ఇప్పుడెలా వుంది.?
ఇదిగో ఇలా వున్నానంటూ మొన్నీమధ్యనే ఆసుపత్రిలో చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో ఒకటి విడుదల చేసింది సమంత.

కానీ, ఇప్పుడు సమంత బాగానే వుంది. చూస్తున్నారు కదా.. ఇవి లేటెస్ట్ ఫొటోలు.! కానీ, ‘పరిస్థితులు ఎలా వున్నాసరే.. బాగానే కనిపించాలి..’ అన్నట్టు ఓ కొటేషన్ పోస్ట్ చేస్తూ, ఈ ఫొటోలు విడుదల చేసింది సమంత.
డెడికేషన్ అంటే ఇలా వుండాలంటూ సమంత గురించి అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు.
Samantha Ruth Prabhu పూర్తిగా కోలుకున్నట్టేనా.?
సమంత ఇంకా కోలుకోలేదు మయోసైటిస్ సమస్య నుంచి. పూర్తిగా నియమయ్యే అనారోగ్య సమస్యేనా ఇది.? అంటే, దానిపై భిన్న వాదనలున్నాయి.
వైద్య చికిత్స అయితే కొనసాగుతోంది. అలాగని, సినిమాని ప్రమోట్ చేయకుండా వుండలేదు కదా.? అందుకే, ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత.
Also Read: అరరె.! పెళ్ళయిపోయిందే.! ఇప్పుడెలా.?
ఇంతకీ, సమంత తదుపరి సినిమాల సంగతేంటి.? పూర్తి ఆరోగ్యంతో సమంత తిరిగి రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. తిరిగొచ్చాక సమంత పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే వున్నాయ్.
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ సినిమా విడుదల కావాల్సి వున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా నిర్మాణంలో వుంది.
అన్నట్టు, అనారోగ్యంతో వున్నప్పుడే సమంత ‘యశోద’ సినిమా డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ‘యశోద’ నిర్మాత వెల్లడించారు. చాలా నీరసంగా వున్నా, సమంత రిస్క్ తీసుకుని డబ్బింగ్ చెప్పిందట.
ఏది ఏమైనా సమంత డెడికేషన్‌కి హేట్సాఫ్ చెప్పాల్సిందే సుమీ.!