Samantha Vijay Kushi Chemistry.. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ ఎందుకు వుండాలి.? ఇదేమీ, సినిమాకి సంబంధించి ప్రాథమిక సూత్రం కాదు.!
ఆ మాటకొస్తే, గ్లామర్ అనగానే.. ఎక్స్‌పోజింగ్ చేయించాలనే రూల్ కూడా ఏమీ లేదు.! కాకపోతే, ఓ సెక్షన్ ఆడియన్స్ ఏవేవో ఆశిస్తుంటారు.. వాటిని సినిమాల్లో అలా అందిస్తుంటారంతే.!
అసలు విషయమేంటంటే, ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha Ruth Prabhu) మధ్య లిప్ లాక్ వ్యవహారం.!
Samantha Vijay Kushi Chemistry.. ఎందుకు పెట్టారో తెలుసా.!
సినిమాలో లిప్ లాక్ అవసరమా.? అని ఎవరో అడిగితే, ‘వాళ్ళిద్దరూ ముందు ప్రేమించుకున్నారు.. పెళ్ళి చేసుకున్నారు.. ఈ క్రమంలో వచ్చిన పాట.. కాబట్టి, రొమాంటిక్‌గా వుంటుందంతే..’ అని సెలవిచ్చాడు దర్శకుడు.

దర్శకుడు శివ నిర్వాణ బాగానే సెలవిచ్చాడు. ‘మిస్ క్యారేజ్.. ఎమోషన్స్..’ ఇలా ఏవేవో చెప్పుకొచ్చాడాయన.! అయితే మాత్రం, లిప్ లాక్ అవసరమా.? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి, ‘లిప్ లాక్’ సీన్‌లో గాఢత పెద్దగా ఏం లేదు. జస్ట్ అలా జరిగిపోయిందంతే. మరీ వల్గర్‌గా కూడా ఏమీ లేదు. అసలు అందులో వల్గారిటీకి ఛాన్సే లేదు. కాస్త జాగ్రత్తగానే డీల్ చేశాడు దర్శకుడు ఈ సన్నివేశాన్ని.
లిప్పు లాకు.. లేకపోయినా.!
లిప్పుు.. లాకు.. కాస్త గాఢంగా డిజైన్ చేసి వుంటే, దాని గురించి ఇంకాస్త ఎక్కువ చర్చ జరిగి వుండేదేమో.! ఆ ఛాన్స్ దర్శకుడు ఇవ్వదలచుకోలేదు.!
Also Read: కడుపు నిండా తినాలి.! గుండె నిండా…!?
అయినాగానీ, సమంత – విజయ్ దేవరకొండ మధ్యన ‘ఖుషి’ సినిమాలో ‘లిప్ లాక్’ వుందట కదా.. అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగిందండోయ్.!
సమంత (Samantha Ruth Prabhu)కి గతంలో పెళ్ళి అయి, విడాకులు జరిగి వుండకపోతే.. ఇంతలా ఈ లిప్ లాక్ గురించిన చర్చ జరిగి వుండేది కాదు.! అంతేనా.? అలాగే అనుకోవాలా.? అంతేనేమో.!