Samantha Weds Raj Nidimoru.. నటుడు అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత, నటి సమంత మీద సోషల్ మీడియా వేదికగా జరిగిన, జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.!
మధ్యలో తీవ్ర అనారోగ్య సమస్యలు, ఆపై కెరీర్‌లో ఒడిదుడుకులు.. దానికి తోడు, ఈ ట్రోలింగ్.. నిజానికి, సమంత ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు, నాగచైతన్యతో విడాకుల తర్వాత.
ఎలాగైతేనేం, సమంత ఎట్టకేలకు మళ్ళీ పెళ్ళి పీటలెక్కింది. స్నేహితుడు రాజ్ నిడమోరుని సమంత పెళ్ళాడింది. వీరిద్దరి వివాహం, అత్యంత సన్నిహితుల సమక్షంలో, చాలా సింపుల్‌గా జరిగిపోయింది.
Samantha Weds Raj Nidimoru.. పుకార్లే నిజమయ్యాయ్..
రాజ్ నిడమోరుకి ఆల్రెడీ పెళ్ళయ్యింది, భార్యకి దూరంగా వుంటున్నారాయన. సమంత సంగతి తెలిసిందే కదా.!
అన్నట్టు, భార్య (మాజీ), సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులే సమంత – రాజ్ మధ్య ఏదో నడుస్తోందన్న గాసిప్స్‌కి కారణమయ్యాయి.
ఇక, సమంత సైతం రాజ్ నిడమోరుతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవడం.. తెలిసిన విషయాలే.

అయినా, అది సమంత లైఫ్.. ఆమె తన జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛని కలిగి వున్నారు. రాజ్ తనకు సరైనవాడని సమంత నిర్ణయించుకుని వుండొచ్చు.
సో, ఇక్కడితో అయినా సమంతకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ ఆగుతుందా.? ఆగదు గాక ఆగదు.! ఎందుకంటే, కొంతమంది పగబట్టేశారు.
ఇదిలా వుంటే, సమంత నుంచి విడాకులు తీసుకున్న అక్కినేని నాగచైతన్య గతంలోనే నటి శోభిత ధూళిపాళని పెళ్ళాడిన సంగతి తెలిసిందే.
కాగా, రాజ్ – డీకే ద్వయం తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో సమంత కీలక పాత్రలో నటించింది. అప్పట్లో ఈ వెబ్ సిరీస్ ఓ సంచలనం.!
రాజ్ నిడిమోరుతో కలిసి నటిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసేందుకు ఆల్రెడీ సమంత ప్లానింగ్స్ చేసుకుంది. ఆ ప్రాజెక్టుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
