Samyuktha Menon Power Unlimited: సంయుక్తా మీనన్.. ఇప్పుడీ పేరుకి పరిచయం అక్కర్లేదు. అంతలా ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ. ‘భీమ్లా నాయక్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సరికొత్తగా ఎట్రాక్ట్ చేసింది. ప్రెజెన్స్‌తో పాటు, స్పీచ్‌తోనూ అదరగొట్టేసింది.
సహజంగా కొత్తగా ఇండస్ర్టీకి పరిచయమైన హీరోయిన్లు, వచ్చీ రాని తెలుగుతో ఇబ్బంది పెట్టేస్తుంటారు. లేదంటే, తెలియని ఇంగ్లీషులో వాయించేస్తుంటారు. కానీ, సంయుక్తా మీనన్ అలా కాదు. చాలా ప్రిపేర్ అయ్యిందామె తన తొలి తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.
కష్టపడి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఎంతందంగా కనిపించిందో అంతందంగా తన మాటలతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan) సంయుక్తా మీనన్ (Samyuktha Menon)అబ్జర్వ్ చేసిన తీరు అభినందనీయం.
Samyuktha Menon Power Unlimited.. సంయుక్త పవర్‌ఫుల్ డైలాగ్స్.!
ఆయన డైలాగుల్ని మక్కీకి మక్కీ దించేసింది. ఏదో నోటికి వచ్చినట్లు చెప్పడం కాదు, అర్ధం చేసుకుని, ఫీల్‌తో చెప్పడం పవన్ ఫ్యాన్స్‌ని ఆలోచింపచేసింది. కేవలం సినిమా డైలాగులే కాదు, పవన్ గతంలో చెప్పిన రాజకీయ నీతులు, సూక్తులు (కోట్స్) సైతం ఎంతో చక్కగా చెప్పేసింది సంయుక్తా మీనన్.
ఇల్లేమో దూరం.. అంటూ సంయుక్త మీనన్ చెప్పిన డైలాగ్ పవన్ అభిమానుల్ని ఫిదా చేసింది. అదొక్కటే కాదు, జీవితంలో గెలవాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం కష్టపడాలంటూ ఒకింత ఆవేశంగానే ప్రసంగించేసింది.

మధ్యలో యాంకర్ సుమ కలగజేసుకుని, మైక్ లాగేసుకుందామనుకుందిగానీ.. చెప్పాలనుకున్నదంతా చెప్పాలని గట్టిగా ఫిక్సయ్యిందేమో.. సుమ తొందరపాటుని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోయింది సంయుక్త మీనన్.
గతంలో చాలా మంది మలయాళ ముద్దుగుమ్మలు తెలుగు తెరపై సందడి చేశారు. చేస్తూనే వున్నారు. వాళ్లందరూ కూడా తెలుగు ఈజీగా నేర్చేసుకున్నారు. కానీ, తొలి సినిమాకే ఈ స్థాయిలో ఫిదా చేయడం సంయుక్త మీనన్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు.
‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాలో రానాకి జోడీగా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. అన్నట్టు తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ సంయుక్త చేతిలో వుంది.
Also Read: ఆ తప్పు చేయనంటోన్న అలియా భట్.!
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నటిస్తున్న మొట్ట మొదటి ప్రాజెక్ట్ అది. ‘సర్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో సంయుక్త (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది.