Samyuktha Menon Virupaksha హీరోయిన్లనగానే గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్.. అనే ముద్ర వేయడం మామూలే.! ఇంతకీ, సంయుక్త మీనన్ ఎలాంటి లెగ్.? ఐరన్ లెగ్గా.? గోల్డెన్ లెగ్గా.?
ఓ జర్నలిస్టు ఇదే ప్రశ్నని సంయుక్త మీనన్ ముందుంచాడు.! ఇంతకీ, సంయుక్త మీనన్ (Samyuktha Menon) సమాధానమేంటట.?
చాచి గూబ మీద కొట్టడం అంటారే.! అదేనండీ గూబ పగలగొట్టేయడం.! అచ్చం అలాంటి సమాధానమే వచ్చింది సంయుక్త మీనన్ నుంచి.
Samyuktha Menon Virupaksha.. బ్యాడ్ క్వశ్చన్..
ఈ మధ్య సినిమా ఈవెంట్స్‌లో జర్నలిస్టులు (కొందరు సినిమా జర్నలిస్టులు) మరీ బుర్ర లేకుండా ప్రశ్నలడుగుతున్నారు.
సంయుక్త మీనన్‌కి కూడా అలాంటి ప్రశ్నే ఎదురయ్యింది మరి. దాంతో, ‘బ్యాడ్ క్వశ్చన్’ అనేసింది. అంతేనా, ‘ఐరన్ లెగ్.. గోల్డెన్ లెగ్.. ఇవి పాతకాలం నాటి మాటలు’ అని తేల్చేసింది.
ప్రశ్నకు సరైన సమాధానం రావాలంటే.. ముందు ప్రశ్న సరైనదై వుండాలి.!
ఏదో పిలుస్తున్నారు, వెళుతున్నాం.. అడిగేస్తున్నాం.. అంటే, అట్నుంచి గూబ గుయ్యిమనేలానే సమాధానాలొస్తాయ్.!
కొందరు లైట్ తీసుకుంటారు.. ఇంకొందరు గూబ గుయ్యిమనేలా సమాధానమిస్తారు.!
అయినా, హీరోయిన్లంటే ప్రశ్నలడిగేవారికి ఎందుకంత చిన్నచూపు.?
జర్నలిజం స్థాయిని తగ్గించేస్తోన్న కొందరు సినీ జర్నలిస్టుల పైత్యానికి మందు లేదా.?
Mudra369
మంచి కథని ఎంచుకున్నామా.? లేదా.? అన్నది ముఖ్యమనీ, లక్కుతో సంబంధం లేదనీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) తేల్చేసింది.
అంతే కాదు, ఓ సినిమా ఫ్లాప్ అయినా.. హిట్ అయినా.. ఆ సినిమా కోసం పని చేసిన అందరికీ బాధ్యత వుంటుందని సంయుక్త చెప్పుకొచ్చింది.
ఫ్లాపయితే ఐరన్ లెగ్.. హిట్టయితే గోల్డెన్ లెగ్..
సినిమా ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అంటారు.. హిట్టయితే గోల్డెన్ లెగ్ అంటారు.. గోల్డెన్ లెగ్ ఇమేజ్ దక్కితేనే అవకాశాలొస్తాయన్నది సదరు ప్రశ్న తాలూకు సారాంశం.
Also Read: Nupur Sanon.! అక్కని మించిన చెల్లెలు.?
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిచ్చిన హీరోయిన్లూ.. స్టార్లుగా ఎదిగిన సందర్భాల్లేకపోలేదు. సినిమాకి లక్కు కూడా అవసరమే.! కానీ, ఆ లక్కుతోనే సినిమాలు ఆడెయ్యవ్.!
నటీనటులు, దర్శక నిర్మాతలు.. ఇలా అందిరికీ లక్కు ఫ్యాక్టర్ కొంత పని చేస్తుంది.. అంతా లక్కుతోనే.. అంటే కుదిరే పని కాదది.!