Samyuktha Menon Virupaksha SDT.. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, తొలి తెలుగు సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.
‘భీమ్లానాయక్’ (Pawan Kalyan Bheemla Nayak) సినిమాలో రానా దగ్గుబాటికి (Rana Daggubati) జోడీగా నటించింది సంయుక్త మీనన్.!
నిజానికి, అంతకు ముందే రెండు సినిమాలకు కమిట్ అయిన సంయుక్త మీనన్ (Samyuktha Menon), ‘భీమ్లానాయక్’ సినిమాతోనే ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
యాక్సిడెంట్ నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాననీ, ఇంకో యాక్సిడెంట్ (పెళ్ళి) ఇప్పట్లో వద్దనీ ఇటీవలే సరదాగా కామెంటేశాడు సాయి ధరమ్ తేజ్.!
అదేంటో, సాయి ధరమ్ తేజ్ మీద ఎక్కువగా హీరోయిన్లతో లింకుల గాసిప్స్ వస్తుంటాయ్.!
సంయుక్త మీనన్ నిజంగానే సాయి ధరమ్ తేజ్‌తో ప్రేమలో పడిందా.?
Mudra369
‘ఆటిట్యూడ్ ఎక్కువ’ అంటూ సంయుక్త మీనన్ గురించి ఓ ప్రచారమైతే సినీ పరిశ్రమలో బలంగా వుంది. అదే సమయంలో, ‘కలుపుగోలుతనం’ కూడా ఆమెకు ఎక్కువేనట.
Samyuktha Menon Virupaksha SDT.. తెలుగమ్మాయ్‌లా మారిపోయి..
తొలి తెలుగు సినిమాతోనే చక్కగా తెలుగులో మాట్లాడేసి, పదహారణాల తెలుగమ్మాయ్ అనిపించేసుకున్న సంయుక్త మీనన్, ‘బింబిసార’, ‘సార్’ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం, ‘విరూపాక్ష’ (Virupaksha Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది సంయుక్త.!
ఇక, ఈ బ్యూటీ గురించి ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, సంయుక్త మీనన్‌తో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రేమలో పడ్డాడని.! ఇద్దరూ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నారని.
అప్పట్లో రెజినా..
అప్పట్లో రెజినా కసాండ్రా, సాయి ధరమ్ తేజ్‌ల (Sai Dharam Tej) మధ్య ‘ఎఫైర్’ అంటూ నానా యాగీ జరిగింది. ఆ తర్వాత రాశి ఖన్నా విషయంలోనూ ఇలాంటి గాసిప్స్ వినిపించాయి.
Also Read: Pushpa The Rule Begins: క్లారిటీ లేదు ‘పుష్పా’.!
కాగా, సంయుక్తతో ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ తప్ప, వేరే ఏం లేదని సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఖండించాల్సిన పరిస్థితి వచ్చేలా వుంది.
అంత ఛాన్స్ సంయుక్త, సాయి ధరమ్ తేజ్‌కి ఇవ్వకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఖండించేయడం సంయుక్తకి (Samyuktha Menon) వెన్నతో పెట్టిన విద్య.!