Sanaathana Dharmam Udayanidhi Stalin.. సనాతన ధర్మం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.
ముఖ్యమంత్రి కొడుకు కూడా కదా.! తాను ఏం మాట్లాడినా చెల్లిపోతుందని ఉదయ నిధి స్టాలిన్ అనుకుంటున్నట్టున్నాడు.!
సంబోదన.. ‘రు’ నుంచి ‘డు’ వరకు మారిందంటే, అది ఆయన స్వయంకృతాపరాధమే.! అసలు సనాతన ధర్మం వల్ల ఉదయ నిధి స్టాలిన్‌కి కలిగిన నష్టమేంటి.?
సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాల్సిందేనని మంత్రి హోదాలో వున్న ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
Sanaathana Dharmam Udayanidhi Stalin.. నమ్మడం.. నమ్మకపోవడం.. వాళ్ళిష్టం.!
ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు విశ్వసించొచ్చు. అదే సమయంలో, ఇతరుల మతాల్ని కించపర్చకూడదు కదా.!
నిజానికి, ‘హిందు’ అనేది మతం మాత్రమే కాదు, అదొక ధర్మం.! అందులోనిదే సనాతన ధర్మం.! మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది సనాతన ధర్మం.
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా.. కోవిడ్ లాంటి రోగాలతో పోల్చాడు ఉదయ నిధి స్టాలిన్.!
ముందు ఉదయ నిధి స్టాలిన్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సనాతన ధర్మం మీద అక్కసు వెల్లగక్కిన చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు.!
సనాతన ధర్మం ఎప్పటికీ.. సజీవంగానే వుంటుంది.! వెలుగులు విరజిమ్ముతూనే వుంటుంది.!
Mudra369
అయితే, ఆ సనాతన ధర్మం ముసుగులో కొందరు పక్కదారి పడితే, ప్రజల్ని పక్కదారి పట్టిస్తే.. అది ఆ ధర్మం తప్పెలా అవుతుంది.?
వేరే మతాల్లో లేవా.?
క్రిస్టియన్ మతంలో కావొచ్చు.. ఇస్లాంలో కావొచ్చు.. అక్రమార్కులు లేరా.? విపరీత మనస్తత్వం కలిగినవారు లేరా.?
క్రిస్టియానిటీ, ఇస్లాం ముసుగులో బలవంతపు మత మార్పిడులని చూస్తూనే వున్నాం.! ఇవన్నీ కాకుండా, దేవుడు లేడంటూ వాదించేవారూ వున్నారు.
Also Read: పాపా.! రాజమౌళి దృష్టిలో పడ్డావట.! నిజమేనా.?
ఎవరి గోల వారిది.! ఎవరి మతాన్ని, ఎవరి ధర్మాన్ని, ఎవరి ఆలోచనల్ని వారు పాటిస్తే, తప్పు లేదు.! కానీ, ఇంకొకరు అనుసరిస్తున్న మతంపైనా, ధర్మంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు.
సమాజంలో వర్గ వైషమ్యాల్ని పెంచి పోషించే.. ఇలాంటి రాజకీయ నాయకుల విషయంలో సమాజం మొత్తం అప్రమత్తంగా వుండాల్సిందే.
హిందుత్వం, హిందూ ధర్మం.. అందునా సనాతన ధర్మం.. సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది కొందరికి.! దురదృష్టమేంటంటే, ఈ దారుణాల్ని హిందూ సమాజం గట్టిగా ఖండించలేకపోవడం.!