సింగిల్ సినిమాతో స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమా ఇచ్చిన జోష్‌తో అమ్మడికి అవకాశాలు పోటెత్తుతున్నాయ్. ఆమె ఎవరో కాదు ‘కాంతారా’ బ్యూటీ (Sapthami Gowda) సప్తమి గౌడ.
‘కాంతారా’లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన ఈ కన్నడ కుట్టీకి తెలుగులోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. అలాగే, హిందీ తదితర భాషల నుంచీ క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయట.
ఆల్రెడీ హిందీలో ఓ సినిమాలో నటిస్తోంది సప్తమీ గౌడ. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తోన్న ‘వ్యాక్సిన్ వార్’ అనే సినిమాతో సప్తమీ గౌడ బాలీవుడ్‌లో అడుగు పెడుతోంది.
Sapthami Gowda.. అంతలోనే బాలీవుడ్‌కి..
ఇంత తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్‌కి వెళ్లే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా వుందని చెబుతోంది సప్తమీ గౌడ.

అలాగే, తమిళ, తెలుగు భాషల్లోనూ తనకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయంటోంది. ఎన్ని ఆఫర్లు వచ్చినా కన్నడ సినిమానే తనకు ఫస్ట్ ఫ్రిఫరెన్స్ అని క్యూట్‌గా చెప్పేస్తోంది ఈ అందాల భామ.
ప్రాంతీయ అభిమానం కూసింత ఎక్కువే.!
దీన్నే అంటారు ప్రాంతీయ అభిమానం అని. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టిన ముద్దుగుమ్మలకు సైతం రాని ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ దక్కించుకుంటుండడం విశేషమే.
Also Read: సొట్టబుగ్గల సుందరి.! పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ.!
ఏ భాషలో అయినా నటించేందుకు తనకెలాంటి అభ్యంతరాల్లేవనీ చెబుతున్న సప్తమీ గౌడ కన్నడలో మరిన్ని మంచి సినిమాలు చేయాలని వుందని అంటోంది.
భాష ఏదైనా సరే, మంచి నటిగా ప్రూవ్ చేసుకోవడమే తన మెయిన్ టార్గెట్ అంటోందీ కన్నడ కస్తూరి. ఇదే జోరు ఇలా కంటిన్యూ అయితే, త్వరలోనే సప్తమీ గౌడ బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోవడం పక్కా.