Home » సవతి తల్లి ‘కా..’ వాంఛకి బలైపోయిన సారంగధరుడి కథ.!

సవతి తల్లి ‘కా..’ వాంఛకి బలైపోయిన సారంగధరుడి కథ.!

by hellomudra
0 comments
Saarangadhara metta

Saragadharudu Chitrangi.. సవతి తల్లి, పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం, చిత్రహింసలకు గురి చేయడం వంటివి చాలా సినిమాల్లో మనం చూశాం.

అయితే, కుమారుడి వరసైన వ్యక్తిపై సవతి తల్లి కామ వాంఛకు పాల్పడడం అనే కథ విన్నారా.?

కొడుకుతో కామ వాంఛా.? ఆవిడేం తల్లిరా బాబూ.. అని ముక్కున వేలేసుకుంటున్నారా.? చరిత్రలో ఇటువంటి కథలు కూడా వున్నాయండీ బాబూ.

ఓ సవతి తల్లి, తనకు కుమారుడి వరస అయిన వ్యక్తి మీద కామ వాంఛతో రగిలిపోతే, దాన్ని ఆ కుమారుడు వ్యతిరేకిస్తే.. నిజం తెలుసుకోలేక, అసత్య ప్రచారాన్ని నమ్మిన తండ్రి కుమారుడికే మరణ శిక్ష విధిస్తే.?

విధి ఎంత బలీయమైనదో కదా.. అలా బలైపోయిన వాడే సారంగధరుడు.

ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, ఈ సాంరగధరుడి ఇతివృత్తం మనకు అర్ధమవుతుంది. ఇప్పుడు రాజమహేంద్రవరం..

అదేనండీ రాజమండ్రిగా పిలుచుకుంటున్న ఒకప్పటి రాజరాజనరేంద్రపురం రాజధానిగా పరిపాలించిన రాజు రాజ రాజ నరేంద్రుడు. ఆయన ముద్దుల తనయుడే సారంగధరుడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథకు హీరో.

సారంగధరుడిపై చిత్రాంగి మోహం..

వయసుకొచ్చిన కొడుక్కి పెళ్లి సంబంధం కోసం బయలుదేరతాడు రాజ రాజ నరేంద్రుడు. అక్కడ చిత్రాంగిని మోహిస్తాడు. కోడలిగా తెచ్చుకోవల్సిన అమ్మాయిని భార్యగా ఇంటికి తీసుకొస్తాడు.

అలా సారంగధరుడికి భార్య కావాల్సిన చిత్రాంగి, రాజరాజనరేంద్రుడికి భార్య అయ్యిందట. దాంతో, రాజరాజనరేంద్రుడి మీద కక్ష కడుతుంది చిత్రాంగి.

తన కక్ష తీర్చుకునేందుకు కొడుకైన సారంగధరుడ్ని మోహిస్తుంది చిత్రాంగి. కానీ, సారంగధరుడు తండ్రి పట్ల అపారమైన భక్తి, గౌరవం కలవాడు.

సకల సుగుణ సంపన్నుడు. దాంతో ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరిస్తాడు. కానీ, చిత్రాంగి వేసే ఎత్తులకు సారంగధరుడు చిత్తవుతాడు. తండ్రి రాజరాజనరేంద్రుడి ఆగ్రహానికి బలైపోతాడు.

చిత్రాంగి ఎత్తులకు చిత్తయిపోయిన సారంగధరుడు

ఓ రోజు రాజరాజనరేంద్రుడు వేట కోసం అడవికి వెళితే, అదను చూసి సారంగధరుడ్ని ప్రత్యేక విందుకి ఆహ్వానిస్తుంది చిత్రాంగి. కామ వాంఛతో రగిలిపోతున్న చిత్రాంగిని చూసిన సారంగధరుడు ఆమెను కాదంటాడు.

దాంతో ఆగ్రహించిన చిత్రాంగి, రాజరాజనరేంద్రుడికి సారంగధరుడిపై తప్పుడు సమాచారమందిస్తుంది. లేనిపోనివన్నీ నూరి పోసి, ఎంతో ప్రేమగా మసిలిన తండ్రీ కొడుకుల మధ్య తగవులకు చిత్రాంగి కారణమవుతుంది.

ఆమె మాయలో పడి, చిత్రాంగి మాటల్ని విశ్వసించిన రాజరాజనరేంద్రుడు, కళ్లు మూసుకుపోయి కన్న కొడుకు నిజాయితీనే శంకిస్తాడు.

సారంగధరుడు చిత్రాంగి దగ్గరకు వెళ్ళాడని.. ఆమెను వేధించాడనీ నమ్మి.. సారంగధరుడ్నిశిక్షించేందుకు ఆదేశాలు జారీ చేస్తాడు.

Saragadharudu Chitrangi.. దారుణమైన శిక్ష: చేతులూ.. కాళ్ళూ నరికేసి

సారంగధరుడికి శిరచ్ఛేదం చేయకుండా చేతులు, కాళ్ళను ఖండించాలనీ.. అలా చేస్తే, చేసిన తప్పుకి సరైన శిక్ష పడినట్లవుతుందని రాజరాజనరేంద్రుడు భావిస్తాడు.

Saarangadhara metta.. Saragadharudu Chitrangi
Saarangadhara metta

సైనికులు మాత్రం, సారంగధరుడి గొప్ప గుణం గురించి తెలుసుకుని.. అతన్ని శిక్షించేందుకు ఇష్టపడరు. కానీ, తండ్రి మాటని జవదాటని సారంగధరుడు, తన తండ్రి విధించిన శిక్షను అమలు చేయాలని కోరతాడు. అలా సారంగధరుడి చేతుల్ని, కాళ్ళని సైనికులు నరికేస్తారు.

Saragadharudu Chitrangi.. శివుడు ప్రత్యక్షమై వరమివ్వడం..

నీతిమంతుడూ, సత్యవంతుడూ, పరమ శివుడి భక్తుడైన సారంగధరుడు, తెగిన చేతులు.. కాళ్ళతో విలవిల్లాడుతూనే పరమశివుడ్ని పూజిస్తాడు.

శివుడు ప్రత్యక్షమై సారంగధురుడికి వరమిస్తాడు. ఆ తర్వాత సారంగధరుడు, పరమశివుడిలో లీనమవుతాడు.

అలా సారంగధరుడు శివైక్యం పొందిన ఆ ప్రాంతాన్నే సారంగధరమెట్టగా పిలుస్తుంటారు. ఇప్పటికీ రాజమండ్రిలో ఆ ప్రాంతం వుంది. అయితే, పట్టణీకరణ కారణంగా.. ఆ ప్రాంతం ఒకప్పటి రూపు కోల్పోయింది.

Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!

అక్కడ చిన్నపాటి గుడి మాత్రమే వుంది. సారంగధరుడికి మోక్షం ప్రసాదించిన పరమేశ్వరుడు, సారంగధరేశ్వరుడిగా అక్కడే పూజలందుకుంటున్నాడు.

ఈ కథకు సంబంధించి రకరకాల వెర్షన్లు వేరే వున్నా.. అక్కడ ప్రముఖంగా వినిపించేది ఇది మాత్రమే. ఇదే కథతో, ఇదే పేరుతో పలు సినిమాలూ, కథలూ రూపుదిద్దుకున్నాయ్ కాల క్రమంలో.

కేవలం తెలుగులోనే కాదు. తమిళ, తదితర భాషల్లో కూడా సినిమాలు రూపొందాయి. తమిళంలో శివాజీ గణేష్ హీరోగా నటించిన ‘సారంగధర‘ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది కూడా.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group