Sarkaru Vaari Paata Pre Review… సూపర్ స్టార్ మహేష్‌బాబు నుంచి కొత్త సినిమా ఎప్పుడొచ్చినా, ఆ పండగ వేరే లెవల్లో వుంటుంది.
‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత వేగంగా, ఇంకో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసెయ్యాలని మహేష్ అనుకోవడమే కాదు, అందుకు అనుగుణంగా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నా, కోవిడ్ పాండమిక్ దెబ్బ కొట్టింది.
ఎలాగైతేనేం, కోవిడ్ గ్యాప్ తర్వాత మహేష్ నుంచి ‘సర్కారు వారి పాట’ అనే ఔట్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయిపోయింది.
మహేష్ కుమార్తె సితార ఓ పాటలో మెరవడం, కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం ‘గీత గోవిందం’ అనే సూపర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ చేస్తున్న సినిమా కావడం.. ఇలా ‘సర్కారు వారి పాట’కు వున్న సూపర్ ప్రత్యేకతలెన్నో.!
Sarkaru Vaari Paata Pre Review ప్రీ రిలీజ్ బిజినెస్ కెవ్వు కేక.!
ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే, మహేష్ (Super Star Maheshbabu) సినిమాల్లోనే హయ్యస్ట్ బిజినెస్ చేసిన సినిమా ఇది. 130 కోట్లకు పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ‘సర్కారు వారి పాట’ సినిమాకి.
టిక్కెట్ ధరలు పెరిగాయ్.. కోవిడ్ పాండమిక్ తర్వాత, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ సరైనది ఇప్పటిదాకా రాకపోవడంతో, ఆ లోటు ‘సర్కారు వారి పాట’ తీర్చేస్తుందన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
ఒక పోకిరి.. ఒక దూకుడు.. ఒక సర్కారు వారి పాట.!
‘పోకిరి’, ‘దూకుడు’ తరహాలో ‘సర్కారు వారి పాట’ వుంటుందంటూ సినిమాపై అంచనాల్ని మహేష్ మరింతగా పెంచేశాడు. అందుకు తగ్గట్టే పాటలూ ఒకదాన్ని మించి ఇంకోటి హిట్టయ్యాయి.

అన్నం తింటున్నాడా.? అందం తింటున్నాడా.? అనేంతలా మహేష్ మరింత యంగ్ లుక్‌తో ఈ సినిమాలో కనిపించడమే కాదు, అలా మెయిన్‌టెయిన్ చెయ్యడానికి ‘డాష్’ తీరిపోతోందంటూ సినిమాలో తన మీద తానే ఓ పంచ్ డైలాగ్ పేల్చేసుకున్నాడు.
Also Read: అమ్మ ప్రేమ.! కాజల్ అగర్వాల్ అలా, ప్రియాంక చోప్రా ఇలా.!
మ్యూజిక్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, డైలాగ్స్ పరంగా.. ఎలా చూసుకున్నా, ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata Review) ష్యూర్ షాట్.. సూపర్ హిట్.. అనే ప్రీ రిలీజ్ టాక్ అయితే తెచ్చేసుకుంది.
జస్ట్.. కొన్ని గంటల్లో సినిమా ఫలితమేంటో తేలిపోనుంది. మినిట్ టు మినిట్.. యూఎస్ ప్రీమియర్స్ నుంచి లైవ్ అప్డేట్స్ కోసం.. చూస్తూనే వుండండి.. ఇదే స్పేస్‌లో.!