అదేమైనా బిస్కట్టా.? చాక్లెట్టా.? కొరికి చూడ్డానికి.? ఒలింపిక్ పోటీల నేపథ్యంలో మెడల్ వస్తే, దాన్ని కొరుకుతుంటారు (Olympic Medal Bite Secret) విజేతలు. ఎందుకని.? ఈ ప్రశ్న చాలా మందిని ఆశ్చర్యంలోకి నెట్టేస్తుంది. ఏదో సరదాకి అలా చేస్తుంటారా.? బలమైన కారణమేదైనా ఉందా.?
అబ్బే.. పెద్ద రీజనేం లేదు. క్యూట్‌గా ఉంటుంది కాబట్టి అలా మెడల్ పంటి బిగువున పట్టి ఫోటోలకు పోజిస్తాం.. అంతే, అంటారు కొందరు క్రీడాకారులు. వచ్చిన మెడల్ అసలైనదో.. కాదో.. తెలుసుకునేందుకు క్రీడాకారులు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని ఇంకొందరు అంటారు.
Also Read: అర్జంటుగా విరాట్ కోహ్లీని పీకెయ్యాల్సిందే.!
మొదట్లో కేవలం బంగారు మెడల్స్ విషయంలో ఇలా కొరుకుడు వ్యవహారం నడిచేదట. మిగతా లోహాలతో పోల్చితే, బంగారం కాస్త మెత్తగా ఉంటుంది. ఘాటు పడితే అది బంగారం అనీ, పడకపోతే, బంగారం పూత పూసిన మెడల్ అనీ, ఆటగాళ్లు భావించేవారట. ఆ తర్వాత అది ఆనవాయితీగా వచ్చిందనీ, ఏ మెడల్ వచ్చిన వారికైనా కొరకడం ఓ ట్రెండ్ అయ్యిందనీ అంటుంటారు.
గతంలో ఓ క్రీడాకారుడు మెడల్‌ని కాస్త గట్టిగా కొరికాడట. దాంతో అతని పన్ను ఊడిపోయిందట. సరదాగా చేసిన ప్రయత్నం తనకు లేని పోని చిక్కు తెచ్చిపెట్టిందని క్రీడాకారుడు ఆ తర్వాత తీరిగ్గా వాపోయాడట. మరీ అంత గట్టిగా అలా ఎలా కొరికేశాడో.. ఏమో.
Also Read: ‘లైగర్’ కథా కమామిషు ఏంటో తెలుసా.?
ఇదిలా ఉంటే, కేవలం ఫోటోల కోసం ఆ ‘కొరుకుడు’ వ్యవహారం తప్ప, దానికి బలమైన కారణమేదీ లేదని క్రీడా విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. క్రీడా రంగ వార్తల్ని కవర్ చేసే ఫోటో గ్రాఫర్లు మెడల్స్‌ని ఆటగాళ్లు కొరికే పోజు పెట్టే దాకా వదలడం లేదు. కరోనా పాపిష్టి కాలం వచ్చింది.. మెడల్స్ కొరకాలంటే (Olympic Medal Bite Secret) ఆటగాళ్లు తటపటాయిస్తున్నారు.