తెలుగు తెరపై ఆమె పలు సినిమాల్లో నటించింది. వాటిల్లో ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. అందుక్కారణం ఆ సినిమాలో ఆమె మత్స్య కన్యలా నటించడమే. తెలుగు తెరపై అప్పటిదాకా ఎప్పుడూ చూడని వింత అది. ఆ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా (Shilpa Shetty Husband Raj Kundra Dark Life), ఇప్పుడు ఏకంగా పోర్న్ సినిమాల వివాదంలో ఇరుక్కున్నాడు.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ సూత్రధారి.. అని ముంబై పోలీసులు చెబుతుండడం గమనార్హం. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు, చాలా విషయాలు వెల్లడించారు. దాంతో, యావత్ బాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రమే కాదు, మొత్తం భారతదేశమంతా షాక్‌కి గురవుతోంది.
Also Read: ‘ప్లస్ సైజ్’.. అది నా తప్పు కాదు.!
అసలు ఎవరీ రాజ్ కుంద్రా.? అంటే, పేద కుటుంబం నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగాడని.. అతని లైఫ్ స్టోరీ చెబుతోంది. ఈ క్రమంలో రాజ్ కుంద్రా చాలా అడ్డదారులు తొక్కాడంటారు. అబ్బే, అదంతా ఉత్తదేనని తన భర్తని వెనకేసుకొస్తుంటుంది శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి.. పెళ్ళి వెనుక రగడ..
చిత్రమేంటంటే, శిల్పా శెట్టి (Shilpa Shetty)- రాజ్ కుంద్రాల (Raj Kundra) వివాహమే పెను వివాదం. తన భార్యకు విడాకులిచ్చేసి, శిల్పా శెట్టితో డేటింగ్ చేశాడు రాజ్ కుంద్రా. రాజ్ కుంద్రా – శిల్పా శెట్టిల మధ్య ప్రేమాయణంతో నలిగిపోయిన ఆ అభాగ్యురాలే కవిత.. (Kavitha Kundra) రాజ్ కుంద్రా మొదటి భార్య.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
‘నా సోదరి భర్తతో నా భార్యకు అక్రమ సంబంధం వుంది.. ఆ విషయమై ఆమెను పలుసార్లు మందలించాను. సోదరి – సోదరుడు అనే బంధాన్ని ఇద్దరూ కలిసి నాశనం చేశారు..’ అని రాజ్ కుంద్రా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ఇవే, ఇలాంటివే చెప్పి శిల్పా శెట్టి దగ్గర సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి, ఆమెకు దగ్గరయ్యాడు రాజ్ కుంద్రా.
అయితే, ఈ వ్యవహారంలో శిల్పా శెట్టి తప్పు కూడా వుందని, కేవలం డబ్బు కోసమే రాజ్ కుంద్రాని శిల్పా శెట్టి పెళ్ళి చేసుకుందని అంటుంటారు. అన్నట్టు, 2012లో రాజ్ కుంద్రా (Raj Kundra) ఓ ట్వీటేశాడు. ‘పోర్న్ వర్సెస్ వ్యభిచారం.. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు.? వ్యభిచారానికీ దీనికీ ఏమైనా వ్యత్యాసం వుందా.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు రాజ్ కుంద్రా.
Also Read: విడాకులూ బ్రేకప్పూ వాట్సప్పూ.?
అప్పట్లో రాజ్ కుంద్రా ట్వీట్ పెద్దగా ఎవర్నీ ఆకట్టుకోలేదు. కానీ, ఇప్పుడది వైరల్ అయ్యింది కొత్త కొత్తగా. అప్పట్లోనే రాజ్ కుంద్రా (Shilpa Shetty Husband Raj Kundra Dark Life), ఈ పోర్న్ రాకెట్ కోసం స్కెచ్ వేశాడనే ప్రచారం జరుగుతోంది. రాజ్ కుంద్రా మాత్రం షరామామూలుగానే తాను ఏ తప్పూ చేయలేదని అంటున్నాడు. ఈ కేసులో గెహనా వశిష్ట్ అనే ఓ నటి కూడా అరెస్టయ్యింది. ఆమె తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది.