Table of Contents
Shilpa Shetty Kundra.. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం.! ఔను, రోజులు అలాగే తగలడ్డాయ్.! పుడితే పబ్లిసిటీ, ఛస్తే పబ్లిసిటీ.! ఏడిస్తే పబ్లిసిటీ, నవ్వితే పబ్లిసిటీ.! పెళ్ళికి పబ్లిసిటీ, విడాకులకీ పబ్లిసిటీ.!
అసలు పబ్లిసిటీ లేనిదెక్కడ.? అందుగలదిందు లేదని సందేహము వలదు.. ఎందెందుకు వెతికినా పబ్లిసిటీ దొరుకును.!
మరీ, ఇంత పబ్లిసిటీ పిచ్చిలో కొట్టుమిట్టాడుతోందేంటి లోకం.? ప్చ్, అలా తయారయ్యింది పరిస్థితి. సోషల్ మీడియా పుణ్యమా అని, చెత్తంతా తీసుకొచ్చి పోగేస్తున్నారిక్కడ.!
శిల్పా శెట్టి ప్రవచనం.!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గుర్తుంది కదా.? ఎందుకు గుర్తుండదు.? ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాలో ఆమె ఒలకబోసిన గ్లామర్ అలా ఎలా మర్చిపోతాం.?
వెంకటేష్‌తోనే కాదు, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. ఇలా పలువురు టాలీవుడ్ నటులతో సినిమాలు చేసేసింది శిల్పా శెట్టి.
Shilpa Shetty Kundra.. ఇంతకీ, శిల్పా శెట్టికి ఏమయ్యిందబ్బా.?
అసలు విషయమేంటంటే, శిల్పా శెట్టికి కాలు విరిగింది. ‘రోల్ కెమెరా యాక్షన్.. బ్రేక్ ఎ లెగ్..’ అని దర్శకుడు చెప్పగానే, కాలు విరగ్గొట్టేసుకుందట శిల్పా శెట్టి. అద్గదీ సంగతి.

ఏదో సరదాకి, ఇలా పేర్కొందిగానీ, షూటింగ్ జరుగుతుండగా దురదృష్టవశాత్తూ కాలు విరిగిందన్నది అసలు విషయం.
ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోమని వైద్యులు చెప్పారట. కాలికి కట్టు వేసి ఇంటికి పంపించారు. అదండీ సంగతి.! అర్థమయ్యింది కదా.? దీన్ని సోషల్ మీడియాలో వెటకారంగా పోస్ట్ చేసింది సొట్ట బుగ్గల సుందరి.
వయసు మీద పడుతున్నా..
వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని సౌందర్యం శిల్పా శెట్టిది. ఔను, మాంఛి వయసులో వుండగా ఎలా స్లిమ్ అండ్ హాటుగా వుందో.. ఇప్పుడూ అంతే.!
Also Read: పావురం చేసిన హత్య.! మీనా భర్తకి అసలేం జరిగింది.?
అంతా యోగాసనాల మహిమ. అన్నట్టు, ఎవరెవరో వేరే యోగాసనాలు నాలుగ్గోడల మధ్య మంచం మీద వేస్తోంటే, వాటిని వీడియోలుగా తీసి, వ్యాపారం చేశాడన్న కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గతంలో అరెస్టయిన విషయం విదితమే.