మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ (సాయి ధరమ్ తేజ్ సోదరుడు) హీరోగా తెరంగేట్రం చేస్తోన్న సినిమా ‘ఉప్పెన’ (Uppena Movie Shocking Story). ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
కన్నడ బ్యూటీ కృతి శెట్టికి (Krithi Shetty) కూడా ఇది డెబ్యూ ఫిలిం.
తొలి సినిమాతోనే దర్శకుడు, హీరో, హీరోయిన్.. ఓ ‘మెగా’ ప్రయోగం చేసేస్తున్నారట. అంత ప్రత్యేకత ఈ సినిమాలో ఏముంది.? అంటే, దానికి సంబంధించి భిన్న కథనాలు విన్పిస్తున్నాయి.
సినిమాలో ‘కీ పాయింట్’ ఇదేనంటూ సోషల్ మీడియాలో చాలా పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. ఇప్పటిదాకా తెలుగు తెరపై ఎవరూ టచ్ చేయని ఓ రిస్కీ ఎలిమెంట్ ఇందులో వుండబోతోందట. నిజానికి, ఇదొక పెద్ద సాహసం.. అంటున్నారు చాలామంది.
‘సినిమా ఎండింగ్ చాలా ఎమోషనల్‌గా వుంటుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా చాలా బాధాకరమైన ముగింపు..’ అన్నది కొన్ని ‘ప్రచారాల’ సారాంశం. ఇంతకీ, ఈ తరహా ప్రచారాలు, పుకార్లు, గాసిప్స్‌లలో నిజమెంత.?
అంటే, వాటిని ఖండించడం ద్వారా సినిమా కథపై చూచాయిగా కూడా క్లారిటీ ఇచ్చేందుకు సినిమా యూనిట్ సుముఖంగా లేదు. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ సినిమా కథని చాలాకాలం క్రితమే వినడం, ఆయన ఓకే చేయడం.. ఆ తర్వాతే సినిమా పట్టాలెక్కడం జరిగాయని అప్పట్లో విన్నాం. అది నిజం కూడా.
ఎంతైనా సుకుమార్ (Sukumar) శిష్యుడు కదా.. ఖచ్చితంగా ఏదో కొత్త ప్రయోగమే చేసి వుంటాడు దర్శకుడు బుచ్చిబాబు సన (Buchibabu Sana). అన్నట్టు, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ‘నీ కళ్ళు నీలి సముద్రం..’ అంటూ సాగే పాట సృష్టించిన, సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.
గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ‘ఉప్పెన’ కరోనా పాండమిక్ నేపథ్యంలో చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఓటీటీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చినా, దర్శక నిర్మాతలు మాత్రం సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారంటే, సినిమాపై (Uppena Movie Shocking Story) ఎంత నమ్మకం మేకర్స్‌కి వుండి వుండాలి.
