Shriya Saran Book Reading.. పుస్తక పఠనం మీద ఎవరికైనా ఆసక్తి వుండడం సహజమే. కొందరికి ఆసక్తి వుండకపోవచ్చు కూడా.!
పుస్తక పఠనం అనేది, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా. చాలామందికి పుస్తక పఠనం ఓ హాబీ.!
సెలబ్రిటీలు, పుస్తకాల్ని పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం కొత్తేమీ కాదు. కేవలం పుస్తకాల్ని అడ్డంగా పెట్టుకుని, అనాచ్ఛాదిత శరీరాన్ని కెమెరాల కళ్ళకి అప్పగించేస్తుంటారు అందాల భామలు.
Shriya Saran Book Reading.. శ్రియ.. ఏం చదువుతోందబ్బా.?
వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అందం శ్రియ శరన్ సొంతం. అప్పుడెప్పుడో, ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియ.
మొన్నటికి మొన్న ‘మిరాయ్’ సినిమాలో ‘అంబిక’ పాత్రలో శ్రియ మెరిసింది. హీరోకి తల్లిగా నటించిందిగానీ, ఫేస్‌లో ఆ గ్లో మాత్రం అలానే వుంది.
చేసింది చిన్న పాత్రే అయినా, ‘మిరాయ్’ సినిమాతో మాంఛి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శ్రియా శరన్. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మిరాయ్’.
రితిక నాయక్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. సూపర్ డూపర్ హిట్టయ్యింది ‘మిరాయ్’.!
ఇక, ఫొటో విషయానికొస్తే.. చాలా సీరియస్‌గా చదివేస్తోంది శ్రియ. ఏం చదువుతోందో ఆమెకే తెలియాలి. ఈలోగా, కెమెరా క్లిక్ అనేసింది.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, గ్లామరస్ హీరోయిన్‌గా నేటి తరం కుర్రాళ్ళ సరసన ఆడి పాడగల అందం శ్రియ శరన్ సొంతం.
Also Read: చాహల్ వర్సెస్ ధనశ్రీ.! విడిపోయాక కూడా ఆగని ‘నాన్సెన్స్’.!
అదే, ఆ సంకేతాల్నే ఇదిగో ఈ ఫొటో ద్వారా ఇవ్వాలనుకున్నట్లుంది శ్రియ. అన్నట్టు, శ్రియకి ఆల్రెడీ పెళ్ళయిపోవడం, ఓ కూతురు కూడా వుండడం.. తెలిసిన విషయాలే.
ఇప్పుడంటే, చాలా అరుదుగా సినిమాలు చేస్తోందిగానీ, ఒకప్పుడు తెలుగులో శ్రియ నెంబర్ వన్ హీరోయిన్.
తెలుగులోనే కాదు, తమిళంలోనూ దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించేసింది శ్రియ శరన్. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ శ్రియ నటించింది.
