Shruti Haasan Love Wedding.. ‘సలార్’ బ్యూటీ శృతి హాసన్ ప్రేమలో పడింది.! ఇదేమీ కొత్త విషయం కాదు, గతంలోనూ ప్రేమలో పడింది.. అంతకు ముందూ ప్రేమలో పడింది.! ఇప్పుడూ ఓ వ్యక్తితో ప్రేమలో వుంది.
ప్రేమికుడితో కలిసి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది శృతి హాసన్ (Shruti Haasan). ఇందులో దాపరికం ఏమీ లేదు.!
అలాంటప్పుడు, శృతి హాసన్ తన పెళ్ళి గురించిన విషయాల్ని మాత్రం ఎందుకు దాస్తుంది.? ఛాన్సే లేదు.!
Shruti Haasan Love Wedding.. నేనెందుకు దాస్తాను.?
‘నేనొకరితో రిలేషన్‌లో వున్నాను. ఆ విషయాల్ని ఎప్పటికప్పుడు చెబుతూనే వున్నాను కదా.? నేనెందుకు పెళ్ళి గురించిన విషయాల్ని దాస్తాను.?’ అంటూ శృతి హాసన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
అసలు విషయమేంటంటే, శృతి హాసన్ పెళ్ళయిపోయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అద్గదీ అసలు సంగతి.

నిజమే.. శృతి హాసన్ డేరింగ్ అండ్ డాషింగ్. గతంలో ప్రేమించిన వ్యక్తినీ, తన తండ్రి కమల్ హాసన్‌కి, బంధువులందరికీ పరిచయం చేసింది.
కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ కాస్తా పెటాకులయ్యింది. ప్రస్తుతం మళ్ళీ ఫ్రెష్ లవ్.! పెళ్ళి విషయంలో శృతి హాసన్‌కి ఓ క్లారిటీ వుంది.
అందుకే, ప్రస్తుతానికి పెళ్ళి ఆలోచన చేయడంలేదు. సమీప భవిష్యత్తులోనూ అంతేనేమో.! కమల్ హాసన్ కూడా అంతే.! ఆయన బాటలోనే నడుస్తోంది శృతి హాసన్.!