శ్యామ్ సింగరాయ్.. గత రెండు సినిమాల్ని ఓటీటీకే పరిమితం చేయక తప్పలేదు హీరో నానికి. ముచ్చటగా మూడో సినిమా కూడా ఓటీటీకే పరిమితం చేయాల్సి వస్తుందేమోనన్న ఆందోళన నానిలో కూడా వుండే వుంటుంది. నాని (Natural Star Nani) అభిమానులూ అదే తరహాలో ఆందోళన చెందారు. కానీ, ‘శ్యామ్ సింగారాయ్’ (Shyam Singha Roy) సినిమా థియేటర్లలోనే విడుదలైంది.
సినిమా చుట్టూ చాలా పెద్ద వివాదం, సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి తెరపైకొచ్చింది. ఓ వర్గం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. విదేశాల్లో ప్రీమియర్ పడినప్పటినుంచీ సినిమాపై నెగెటివ్ టాక్ వ్యాపింపజేస్తూ వచ్చారు.
శ్యామ్ సింగరాయ్ చూసినోళ్ళేమంటున్నారు.?
ఇంతకీ, ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా వుంది.? సినిమా చూసినవాళ్ళేముంటున్నారు.? రెండేళ్ళ తర్వాత పెద్ద స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూసి నాని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారన్నది నిర్వివాదాంశం. నటుడిగా నానికి వంక పెట్టలేం.
ఈసారి అంతకు మించి.. అనే స్థాయిలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల్లో నాని ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.

‘శ్యామ్ సింగారాయ్’ సినిమాకి సంబంధించి మరో ప్రధాన ఆకర్షణ సాయి పల్లవి (Sai Pallavi). ఈ సినిమాలో సాయిపల్లవిని మరో కొత్త కోణంలో చూస్తున్నామన్నది సినిమా చూసిన వారు చెబుతున్నమాట. మామూలుగా వన్ మేన్ షో.. అంటుంటాం.
సాయిపల్లవి (Sai Pallavi) తెరపై కన్పిస్తున్నంతసేపూ ‘వన్ విమెన్ షో’ అనే భావన కలిగిందట చాలామందికి. ‘ఉప్పెన’ ఫేం కృతి శెట్టి (Krithi Shetty) మాత్రం పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించిందట. కానీ, ఆమె నటించిన స్మోకింగ్ సన్నివేశం.. వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
Also Read: స్పెషల్ సాంగ్ సాయి పల్లవి దగ్గరకొస్తే.. ఏం చేస్తుంది.?
సినిమాటోగ్రఫీ చాలా బావుందనీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుందనీ, పాటలు తెరపై చూడ్డానికీ చాలా బావున్నాయనీ అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకీ రానంత పాజిటివ్ బజ్ ‘శ్యామ్ సింగరాయ్’కి (Shyam Singha Roy Review) సినిమా క్రిటిక్స్ నుంచి వస్తుండడం గమనార్హం.