Siddhi Idnani Sottabuggalu.. ఎవరీ సొట్ట బుగ్గల సుందరి.? సిగ్గులొలికే అందాలతో ఇంతలా కవ్విస్తోందీ.? అనుకుంటున్నారా.? గెస్ చేయండి.
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన ఓ తెలుగు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది.
పేరు సిద్ది ఇద్నానీ. గుర్తొచ్చిందా.? అదేనండీ ‘జంబ లకిడి పంబ’ అనే సినిమా వచ్చింది కదా ఆ మధ్య. ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మే ఈ సొట్ట బుగ్గల సుందరి సిద్ది ఇద్నానీ.
ముంబయ్ బ్యూటీ. తొలి తెలుగు సినిమా హిట్ కాలేదు కానీ, ఆమె పాత్రకు మంచి పేరే దక్కింది. కానీ, ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు తెలుగులో.
Siddhi Idnani Sottabuggalu.. ఒక్క సినిమాతో పిచ్చ పిచ్చగా వచ్చేసిన క్రేజ్.!
తమిళంలో ఒకట్రెండె సినిమాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆమె హిందీలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమానే.

లీడ్ హీరోయిన్ రోల్ పోషించిన ఆదా శర్మతో పాటూ, సిద్దీ ఇద్నానీ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా గురించి ప్రపంచం ఏ స్థాయిలో మాట్లాడుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ టాక్‌తోనే అందాల భామ సిద్ది ఇద్నానీకీ క్రేజ్ వచ్చేసింది. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే సిద్ధి ఇద్నానీ సోషల్ మీడియాలో తన విశ్వరూపం చూపిస్తోంది.
గ్లామర్ కళ.. సక్సెస్ పుణ్యమే సుమా.!
అందాల ఫోటో షూట్లతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది. సక్సెస్ తెచ్చిన వెలుగు.. ముఖంలో కొత్తగా కళ కళలాడిపోతోంది.
ఇదే సందుగా, తనలోని గ్లామర్ యాంగిల్స్ అన్నింటినీ ఒక్క చోట పోగేసి ఇదిగో ఇలా అందంగా బయట పెట్టేసింది సిద్ధి ఇద్నానీ (Siddhi Idnani).
Also Read: Hansika Motwani Gutle.. అరే ‘గూట్లే’.! నీకెవరు చెప్పార్రా.!
గుండ్రని ముఖ వచ్ఛస్సుతో పాటూ, ఫక్కున నవ్వితే పడే ఆ అందమైన బుగ్గ సొట్టకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
ఎవరే ఈ సొట్ట బుగ్గల సుందరి.? అని ఆరా తీస్తున్నారు. కట్ చేస్తే, జంబ లకిడి పంబ.! ఆ భామే ఈ ముద్దులొలికే ముద్దుగుమ్మ.! అని అవాక్కవుతున్నారు.