Simhadri 4k Disaster ఎలాగోలా ‘సింహాద్రి’ సినిమాని వంద కోట్ల క్లబ్బులో పడేస్తారేమో.! అలాగే వుంది పరిస్థితి చూస్తోంటే.
అసలు ఎందుకిదంతా జరుగుతోంది.? రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ నటించిన ‘సింహాద్రి’ సినిమాని ఇటీవల ‘4కె’ వెర్షన్‌లో విడుదల చేశారు.
అప్పుడెప్పుడో వచ్చేసిన సినిమా, తమ అభిమాన హీరో పుట్టినరోజునాడు సరికొత్తగా విడుదలవుతోంటే, అభిమానుల్లో ఉత్సాహం కనిపించడం సహజం.
కానీ, ఇదో వేలం వెర్రిలా తయారైంది.! ప్రీ-రిలీజ్ ఈవెంటు కూడా నిర్వహించేశారు. అడ్వాన్స్ బుకింగులు, ఫస్ట్ డే వసూళ్ళు.. ఇలా సరికొత్త పంచాయితీకి తెరలేపారు.
Simhadri 4k Disaster 8 కోట్లు అట.! నమ్మేలా వుందా.?
మూడు నాలుగు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లు వసూలయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు.
‘ఆల్ టైమ్ రికార్డ్’ అని కూడా పేర్కొంటున్నారు. అయితే, చాలా చోట్ల ‘సింహాద్రి 4కె’ పరిస్థితి అత్యంత దారుణంగా వుంది. నిజానికి, దీన్ని డిజాస్టర్ రిజల్ట్‌గా పేర్కొనవచ్చు.

దర్శకుడు రాజమౌళి, ‘సింహాద్రి’ సినిమా గురించి కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘సింహాద్రి’ మంచి విజయం సాధించిందనీ, అయితే 175 రోజులు ఎక్కువ థియేటర్లలో ఆడించే క్రమంలో తప్పుడు లెక్కలు చెప్పారన్నది రాజమౌళి ఆవేదన.
ఎన్టీయార్ రంగంలోకి దిగాల్సిందే.!
దర్శకుడే ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడంటే, ‘సింహాద్రి’ గురించి గతంలో ఎంత ఛండాలం జూనియర్ ఎన్టీయార్ అభిమానులు చేశారో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడూ అదే పరిస్థితి.! ఈ ఇబ్బందికరమైన పరిస్థితి యంగ్ టైగర్ ఎన్టీయార్ లాంటి హీరోకి రావడం ఆశ్చర్యకరమే. తన అభిమానుల్ని ఈ విషయమై జూనియర్ ఎన్టీయార్ మందలించాల్సి రావొచ్చేమో.
Also Read: Viral Video Mother Kids: పిల్లలెలా పుడతారో చెప్పిన అమ్మ.!
ఇంతకీ, 8 కోట్లతో ఆపుతారా.? ఓ ఏడాదిపాటు ఎలాగోలా ఆడించేసి, వంద కోట్లని అంటారా.? పోనీ, కనీసం 50 కోట్లు.? పోనీ, పాతిక కోట్లు.? చివరికి పది కోట్లు.?
ఏమో, 10 కోట్ల దగ్గర యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఆగుతారేమో.!
అయినా, ‘సింహాద్రి 4కె’ చూసి ఎంజాయ్ చెయ్యడం మానేసి.. ఇతర హీరోల్ని బూతులు తిట్టడమేంటి.?
పైగా, నందమూరి బాలకృష్ణ మీద అత్యంత హేయంగా తిట్ల దండకం అందుకుంటున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.
దానికి తోడు, థియేటర్లను తగలబెట్టడం.. దీన్ని పైశాచిక ఆనందం అనాలా.? ఇంకేమన్నా అనుకోవాలా.?