Table of Contents
Single Simham Ys Jagan.. వైసీపీలో ఏం జరుగుతోంది.? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి.? వైఎస్సార్సీపీ అధినేత ‘సింగిల్’ సంకేతాల్ని ఎలా చూడాలి.?
సింగిల్ సింహం.. అంటూ, 2019 ఎన్నికల్లో నానా హంగామా చేసి, రెండు ‘సింగిల్స్’ తీశారు.. అనగా, వైసీపీకి రెండు ఒకట్లు.. అదేనండీ, 11 సీట్లు వచ్చాయ్.
‘వై నాట్ 175’ అంటేనే, వైసీపీకి 11 సీట్లు వచ్చాయ్.! ‘వై నాట్ 175’ అంటే తెలుసు కదా.? టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి గుండు కొట్టేస్తామన్నది అప్పట్లో వైసీపీ చెప్పిన మాట.!
Single Simham Ys Jagan.. నిజం తెలుసుకునే ప్రయత్నం జగన్ చెయ్యరా.?
ఇప్పటికీ వాస్తవ ప్రపంచంలోకి రాలేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చి, ఆరు నెలలు కాకుండానే, వైఎస్ జగన్ నానా యాగీ చేస్తున్నారు. ఈవీఎం మాయాజాలం అంటున్నారు.. ప్రజా వ్యతిరేకత అంటున్నారు.. ఏదేదో చెబుతున్నారు.

అసలంటూ వైఎస్ జగన్, 15 రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్నారా.. ఎన్నికల ఫలితాల తర్వాత.? లేరాయె.! అలాంటప్పుడు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆయనకెలా అర్థమవుతాయ్.?
వైసీపీ పాలనలో రాష్ట్రం ఐదేళ్ళపాటు సర్వనాశనమైందని ప్రజలే తీర్పునిచ్చారు. అందుకే, వైసీపీకి 11 సీట్లు వచ్చాయ్.
బిగ్ జీరో అయిపోయే ప్రమాదముంది జగన్..
సర్వనాశనమైన రాష్ట్రం కోలుకోవడానికి కనీసం రెండు మూడేళ్ళ సమయం పడుతుందన్నది ప్రజలు చెబుతున్నమాట.
ఆ లెక్కన, వైసీపీ.. నెల తిరగకుండానే కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మితే, ప్రజల్లో వైసీపీ మరింత పలచనైపోదా.? ప్చ్.. వాస్తవం వైఎస్ జగన్‌కి ఎప్పటికీ అర్థం కాదు.

‘టీడీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయ్..’ అని జోస్యం చెబుతున్నారు వైఎస్ జగన్. తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది.. అన్నట్లుంది పరిస్థితి.
అసలంటూ వైసీపీలో ఇప్పుడు నాయకులేరీ.? ఒకరొకరుగా వైసీపీని వీడుతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది, వైసీపీ పట్ల కమిట్మెంట్‌తో వున్నారు.? ఎంపీల పరిస్థితేంటి.?
టీడీపీ కన్నెర్రజేస్తే..
ఇవన్నీ వైఎస్ జగన్ పక్కాగా లెక్కలేసుకోవాలి కదా.? పార్టీ ఫిరాయింపులపై కూటమి పార్టీలు కాస్త స్పెషల్ ఫోకస్ పెడితే, జస్ట్ పదిహేను రోజుల్లో వైసీపీ ఖాళీ అయిపోతుంది.
Also Read: ప్రాయశ్చిత్త దీక్ష: ఏడుకొండలవాడా.! క్షమించు.!
టీడీపీకి సింగిల్ డిజిట్.. అని జగన్ అంటున్నారుగానీ, టీడీపీ తలచుకుంటే వైసీపీ (YSR Congress Party) ‘జీరో’ అయిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.
వున్నపళంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన స్క్రిప్టు మార్చుకోవాలి. స్క్రిప్టు రాసిస్తున్నవారినీ మార్చుకోవాలి. ‘వైనాట్ 175’ నినాదం ఓ డిజాస్టర్. సింగిల్ సింహం.. అంతకన్నా పెద్ద డిజాస్టర్. ఇప్పుడీ సింగిల్ సీట్.. అన్నది మరింత జుగుప్సాకరం.!