Sobhita Dhulipala Glam Shot.. అదృష్టం అక్కినేని ఫ్యామిలీ రూపంలో వచ్చింది.. అంటే అది అందాల భామ శోభితదే అనుకోవచ్చేమో.
అవునండీ.! సినిమాల్లో హీరోయిన్‌గా సాధించింది తక్కువే అయినా.. అక్కినేని కోడలిగా ప్రస్తుతం శోభితకు దక్కుతున్న గౌరవం ఎక్కువే అనడం అతిశయోక్తి కాదేమో.!
ఆ సంగతి పక్కన పెడితే, శోభిత ధూళిపాళ్ల అందాల పోటీ నుంచి మోడల్‌గా ఎదిగి, ఆ పై వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది.
శోభిత మొదట బాలీవుడ్‌లో ‘రామన్ రాఘవ్ 2.0’లో నటించింది. ఆ తర్వాతే తెలుగులో అడుగు పెట్టింది.
Sobhita Dhulipala Glam Shot.. ‘మేడ్ ఇన్ హెవెన్’ ఆటిట్యూడ్..
అచ్చమైన తెలుగమ్మాయ్ అయిన శోభితకు తెలుగులో అడవి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమాలో అవకాశం దక్కింది. ఆ తర్వాత ‘మేజర్’ సినిమాలో నటించింది.
ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ, మలయాల తదితర భాషల్లోనూ ఒకటీ, అరా సినిమాల్లో శోభిత నటించింది.

అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ట్రెండ్ వచ్చాకా అందులోనూ శోభితకు మంచి ప్లేస్ దక్కింది. శోభిత నటించిన కొన్ని వెబ్ సిరీస్‌లు పాపులర్ అయ్యాయ్.
వాటిలో ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో శోభిత పోషించిన తార ఖన్నా పాత్ర ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు తీసుకొచ్చింది.
బ్యూటీ ఆఫ్ స్టైలింగ్..
ప్రస్తుతం మరిన్ని సినిమా అవకాశాల కోసం శోభిత ప్రయత్నిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలే కాదు, ఛాలెంజింగ్ రోల్స్ కోసం కూడా వెతుకుతున్నానని శోభిత చెబుతోంది.
ఆ సంగతి అటుంచితే, అక్కినేని కోడలయ్యాకా.. శోభిత హాజరవుతున్న ఈవెంట్స్‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది కూడా.
Also Read: ‘బైసన్’తో తెలుగు మార్కెట్‌పై ధృవ్ విక్రమ్ పాగా.!
తాజాగా సోషల్ మీడియాలో శోభిత ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయ్. ఈ పిక్స్‌లో శోభిత బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలిష్‌గా మెరిసిపోతోంది.
చెవులకు పెట్టిన కాంట్రాస్ట్ ఇయర్ రింగ్స్‌తో పాటూ, ఆమె చేతిలోని డ్రస్ మ్యాచింగ్ వాలెట్ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది.
