Sobhita Dhulipala.. తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాళ, తెలుగు నాట ఎంటర్టైన్మెంట్ రంగంలో అవకాశాలు దక్కించుకోవడం సంగతెలా వున్నా, హిందీలో మాత్రం బాగానే ఛాన్సులు దక్కించుకుంటోంది.
ఇటీవలే ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. కనిపించిందంటే, జస్ట్ కనిపించిందంతే.!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కి పెయిర్‌గా నటించింది ఆ సినిమాలో శోభిత.! గతంలో కూడా శోభిత పలు హిందీ వెబ్ సిరీస్‌లలో కనిపించింది.
కానీ, ఈసారి ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. కారణం, అనిల్ కపూర్ సరసన నటించడమే. పైగా, అరవయ్యేళ్ళు పైబడిన అనిల్ కపూర్‌తో లిప్ లాక్ సీన్ వ్యవహారంపై మరింత దారుణమైన ట్రోలింగ్ చవిచూస్తోంది శోభిత.
Sobhita Dhulipala.. అయితే.. తప్పేంటట.!
లిప్ లాక్ సీన్స్ వెండితెరపై కొత్తేమీ కాదు. వెబ్ సిరీస్‌లలో అయితే, అవి లేకుండా కష్టమే.. అన్న అభిప్రాయముంది. అవసరం వున్నా.. లేకున్నా, వెబ్ సిరీస్‌లలో లిప్ లాక్ తప్పనిసరైపోయింది.

ఇక, ఓవర్ డోస్ గ్లామర్.. అనే మాట వాడటం కూడా అనవసరం. ఎందుకంటే, వెబ్ సిరీస్ పేరుతో నడిచే కథంతా అత్యంత అసభ్యకరమేనని చాలా వెబ్ సిరీస్‌లు ప్రూవ్ చేశాయ్.
Also Read: Raashi Khanna: విజయ్ దేవరకొండతో ఇంకోస్సారి.!
‘లిప్ లాక్ విషయంలో వయసుతో సంబంధమేముంది.? ఆయా పాత్రల తీరు తెన్నుల్ని బట్టి ఆయా సీన్స్ డిజైన్ చేస్తారు..’ అంటూ శోభిత ధూళిపాళ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
టైమ్ పాస్ ట్రోలింగ్‌ని అస్సలు పట్టించుకోనంటూ శోభిత తేల్చి చెప్పింది.