Home » సోషల్ మీడియాపై బ్యాన్.! భవిష్యత్ ఎలా వుండబోతోంది.?

సోషల్ మీడియాపై బ్యాన్.! భవిష్యత్ ఎలా వుండబోతోంది.?

by hellomudra
0 comments

Social Media Ban India.. కర్నాటకలో 16 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియాని యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా చట్ట సభల్లో తీర్మానించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 13 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియాని అందుబాటులో లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది.

ముందు ముందు దేశంలోని చాలా రాష్ట్రాలు ఇదే బాటలో పయనించనున్నాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్‌పై ఉక్కుపాదం మోపేసింది.

ఇప్పుడెక్కడా సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్ కనిపించడం లేదు. ఒకప్పుడు ‘క్రైమ్’గా భావించే ‘పో..ర్న్..’ వీడియోలు, నిన్న మొన్నటిదాకా ‘ఎక్స్’ (ఒకప్పటి ట్విట్టర్)లో దర్శనమిచ్చేవి.

Social Media Ban India.. మార్పు మంచిదేగానీ..

ఎలాగైతేనేం, మార్పు మంచిదే.! కాస్త ఆలస్యమైనా కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలూ ఇప్పుడిప్పుడే, చిన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా చర్యలు చేపడుతున్నాయి.

ఔను, సోషల్ మీడియా కారణంగా విద్యా వ్యవస్థ సర్వనాశనమైపోతోంది. పిల్లలు స్కూళ్ళలో ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు.

దాంతో, ఎంతో విలువైన సమయం వృధా అయిపోతోంది. ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్.. వాట్ నాట్.. ఏ సోషల్ మీడియా వేదిక తీసుకున్నా.. ఒకటే వ్యవహారం.

అయితే, సోషల్ మీడియాని 18 ఏళ్ళ లోపు వారికి యాక్సెస్ లేకుండా చేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ విషయమై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటే బావుంటుందేమో.

మరోపక్క, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఒక్కసారిగా ఈ నిర్ణయాలపై షాక్‌కి గురవుతున్నారు. సోషల్ మీడియా అంటే, స్వయం ఉపాధి పథకం లాంటిది చాలామందికి. అలాంటి వారందరికీ, ఇప్పుడు షాక్ తగలనుంది.

Also Read: రియల్ ఎస్టేట్ ఢమాల్.! స్టూడెంట్స్ విదేశీ విద్యా వెతల్.!

అసలంటూ, సోషల్ మీడియా యాక్సెస్ పిల్లలకు లేకపోతే ఏమవుతుంది.? విద్యనభ్యసించే విధానం మారుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పిల్లలకు మంచి అలవాట్లు అబ్బుతాయనీ, క్రైమ్ రేట్ తగ్గుతుందనీ.. ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి విద్యావేత్తల నుంచి.

ఇదిలా వుంటే, అడల్ట్ కంటెంట్ మీద ఎలాగైతే కేంద్రం చర్యలు తీసుకుందో, సోషల్ మీడియాలో క్రైమ్ కంటెంట్ మీద కూడా అలానే కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లూ పెరుగుతున్నాయి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group