ప్రపంచం స్వైన్ ఫ్లూ వైరస్‌ని చూసింది.. జికా వైరస్‌ని చూసింది.. ఇంకేవేవో వైరస్‌లను చూసింది. కానీ, కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమే విలవిల్లాడిపోతుందనీ.. ‘లాక్ డౌన్’తో ప్రపంచం మొత్తం స్తంభించిపోతుందనీ ఎవరైనా కలలోనైనా అనుకున్నారా.? సోషల్ మీడియా (Social Media Outage) ఆగిపోతేనో.?
సినిమాల్లో చూడటమే తప్ప, నిజ జీవితంలో అలా జరగదన్నది చాలామంది భావన. కాదు, గట్టి నమ్మకం. కానీ, కరోనా పాండమిక్ వచ్చింది. ప్రపంచమంతా విలవిల్లాడింది.. విలవిల్లాడుతూనే వుంది. సంపన్న దేశం, పేద దేశం.. అన్నటినీ దాదాపుగా ఒకేలా డీల్ చేసింది కరోనా వైరస్.
Social Media Outage ఆగిపోయిందహో..
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలు అర్థాంతరంగా నిలిచిపోతే.? ఛాన్సే లేదని అంతా అనుకున్నారు. కానీ, నిలిచిపోయాయ్. ఇంకేముంది.? ప్రపంచం ఇంకోసారి పెద్ద షాక్‌కి గురైంది. ‘సాంకేతిక సమస్య తలెత్తింది.. సమస్యను పరిష్కరిస్తాం..’ అని ఆయా సంస్థలు ఇతర వేదికల ద్వారా వెల్లడించాయ్.
Also Read: ది ‘గ్రేట్’ సొల్లు పురాణం! మూర్ఖులకి అర్థమయ్యిందిదే
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. వంటివి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనివారి పరిస్థితేంటి.? కాస్సేపు మైండ్ బ్లాంక్ అయ్యింది.. చాలా సేపు అది కొనసాగింది. పది నిమిషాలు.. పావుగంట.. అరగంట.. గంట.. ఆ పైన.. ఇలా సమయం గడుస్తున్న కొద్దీ, చాలామందిలో వేదాంతం కనిపించింది.
ట్విట్టర్ లాంటి కొన్ని వేదికల ద్వారా వాట్సాప్ సహా, నిలిచిపోయిన మిగతా రెండు సామాజిక మాధ్యమాలు.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మీద కుప్పలు తెప్పలుగా సెటైర్లు పడ్డాయి. సెటైర్ల సంగతి సరే, ఈ సామాజిక మాధ్యమాలు లేకపోతే మనిషి జీవితం ఏమైపోతుంది.?
ఇలాగైతే ప్రపంచం ఏమైపోతుంది.?
ఏమీ అయిపోదు.. కాస్తంత మనిషి, తాను మనిషినన్న విషయాన్ని గుర్తెరిగేందుకు ఇదో మంచి అవకాశం అంతే. అందుబాటులో అన్నీ వున్నాయ్.. ఎంజాయ్ చేసేస్తున్నాం. ఏమీ లేకుండా పోతే.? ఆ తర్వాత ఎలా బతకాలి.? అన్న ఆలోచన చేయడానికి ఇదొక అవకాశం. కరోనా వైరస్ ప్రపంచానికి నేర్పింది కూడా అదే.
Also Read: కొత్త పైత్యం.. స్కూళ్ళలో శృంగార విద్యాభ్యాసం.?
కానీ, కరోనా పాండమిక్ నుంచి ప్రపంచం ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకోదు కూడా.! సోషల్ మీడియా తాత్కాలిక సాంకేతిక సమస్యలతో ఆగిపోయినా (Social Media Outage) అంతే.. మనిషి మారే ప్రసక్తే లేదు.