Sonakshi Sinha Jatadhara.. నటుడు సుధీర్‌బాబుది విలక్షణమైన శైలి. కథల ఎంపికలో, ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంటాడు.
భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ, విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, సక్సెస్ ఫెయిల్యూర్.. వంటివాటికి అతీతంగా, సుదీర్‌బాబు కెరీర్‌లో ముందుకెళుతున్న సంగతి తెలిసిందే.
తొలి సినిమా దగ్గర్నుంచి, ఇప్పటిదాకా.. సుధీర్‌బాబు చేసిన సినిమాలన్నీ, దేనికదే ప్రత్యేకం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
డాన్సులు బాగా చేస్తాడు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టేస్తాడు. నటనలో, డైలాగ్ డెలివరీలో.. కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ వచ్చాడు సుధీర్‌బాబు.
తెలుగు ప్రేక్షకులకే కాదు, బాలీవుడ్ ప్రేక్షకులకీ సుధీర్‌బాబు సుపరిచితుడే. టైగర్ ష్రాఫ్‌కి ధీటుగా విలనిజం పండించాడు సుధీర్‌బాబు.. అది అప్పట్లో సంచలనం.
Sonakshi Sinha Jatadhara.. ప్యాన్ ఇండియా సంచలనం జటాధర..
ఇక, తాజాగా ‘జటాధర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సుధీర్‌బాబు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
పాన్ ఇండియా స్థాయిలో ఈ ‘జటాధర’ విడుదల కానుంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్.. సంయుక్తంగా ఈ చిత్రానికి రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఈ చిత్రంలో ‘ధన పిశాచి’గా కనిపించనుందా.? అంటే, ఔననే అనుకోవాలేమో.! మేకర్స్, తాజాగా సోనాక్షి సిన్హాను ధన రాక్షసిగా అభివర్ణిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
Also Read: జూనియర్ ఎన్టీయార్‌ని ఎవరూ ఆపలేరు.!
విజయ దశమి సందర్భంగా, ‘ధన పిశాచి’ అంటూ సాగే సాంగ్‌ని ‘జటాధర’ టీమ్ విడుదల చేయనుంది. తెలుగులో ఇదే ఆమెకు తొలి స్ట్రెయిట్ సినిమా అనుకోవచ్చా.?
పాన్ ఇండియా సినిమా కదా, తెలుగు సహా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ ‘జటాధర’ విడుదల కాబోతోంది. ఇదీ, ‘ధన పిశాచి’ కథ కమామిషు.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ‘ధన పిశాచి’గా సోనాక్షి సిన్హా భలే సెట్టయ్యింది.!
