Sonal Chauhan F3 Movie.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్3’ సినిమా, అంతకు ముందు వచ్చిన ‘ఎఫ్2’ సినిమాకి సీక్వెల్ కాదట.
‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే కాన్సెప్టుకి కొనసాగింపు అట. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి వెల్లడించాడు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదాతోపాటు సోనాల్ చౌహన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి అదనపు అట్రాక్షన్‌గా చెప్పుకోవాలి.
పెళ్ళాల బాధ తట్టుకోలేక విలవిల్లాడే పాత్రల్లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించడం.. వాళ్ళని వేపుకు తినే పెళ్ళాలుగా తమన్నా, మెహ్రీన్ నటించడం తెలిసిన విషయాలే.
Sonal Chauhan F3 Movie.. అప్పుడు కట్టప్ప.. ఇప్పుడు లేడీ కట్టప్ప.!
ఇంతకీ, ఈ సినిమాలో సోనాల్ చౌహన్ పాత్ర ఏంటట.? సినిమా ప్రమోషన్లలో తమన్నా కంటే ఎక్కువగా కనిపిస్తోంది సోనాల్ చౌహన్. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర అని మాత్రమే చెబుతోందామె.

కామెడీ జోనర్‌లో గతంలో సినిమాలు చేయలేదనీ, ఇది చాలా స్పెషల్ ఫిలిం అనీ చెబుతోంది సోనాల్ చౌహన్.
పాత్ర ఏంటో చెప్పకుండా, సోనాల్ చౌహన్ మీడియా ముందుకు రావడం.. ఒకింత ఇబ్బందికరంగానే వుంది.. ఆమెని ఇంటర్వ్యూలు చేస్తున్నవారికి.
సోనాల్ చౌహన్ కూడా, ‘నా నోటికి తాళం వేసేశారు. నా పాత్ర గురించి చెప్పకూడదు..’ అంటూ మొహమాటంగా మాట్లాడుతోంది సోనాల్ చౌహన్.
Also Read: Keerthy Suresh.. ‘సర్కారు వారి పాట’తో లాభమా.? నష్టమా.?
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..’ అన్న తరహాలో, ‘ఎఫ్3’ సినిమాలో సోనాల్ చౌహన్ పాత్రని సస్పెన్స్‌గా వుంచాలనుకున్నట్టున్నారే మేకర్స్.

మరీ అంత పెద్ద పోలికా.? అంటే, ఇస్తున్న బిల్డప్ అలాగే తయారయ్యింది మరి.!
దేవిశ్రీ ప్రసాద్ ఈ ‘ఎఫ్ 3’ చిత్రానికి సంగీతం అందించాడు. గతంలో ‘ఎఫ్ 2’ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం విదితమే.