Sree Leela Guntur Kaaram.. డాన్సింగ్ డాళ్ శ్రీలీలకి టెన్షన్ పెరిగిపోతోందట. అందుకు కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేనండీ ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందేగా.!
ఈ సినిమాలో మొదట శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, లీడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్ధే హ్యాండివ్వడంతో శ్రీలీల ఆ ప్లేస్‌లోకి వచ్చేసింది.
అనూహ్యంగా దక్కిన ఈ అవకాశానికి శ్రీలీల ఎగిరి గంతేసినంత పని చేసింది. ముందూ వెనకా చూడకుండా డేట్స్ ఇచ్చేసింది. లాక్కోలేక, పీక్కోలేక అన్నట్లుగా తయారయ్యింది ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి.
Sree Leela Guntur Kaaram.. ఎరక్కపోయి ఇరుక్కుపోయా.!
అదేంటీ.! మహేష్ బాబు సినిమాలో హీరోయిన్.. అదీ ఇంత తక్కువ టైమ్‌లో అంటే ఆ కిక్కు వేరే లేవల్ కదా.! అనుకోవడం సహజమే.

అయితే, ‘గుంటూరు కారం’ సినిమా పరిస్థితి అందరికీ తెలిసిందే. అసలీ సినిమా పూర్తవుతుందా.? లేదా.? అనే అనుమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయ్.
దాంతో, ఎరక్కపోయి ఇరుక్కుపోయా.. అన్న చందంగా మారింది శ్రీలీల పరిస్థితి. అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తున్న ఈ సినిమా కారణంగా కమిట్ అయిన మిగిలిన సినిమాల నుంచి ఒత్తిడి పెరిగిపోతోందట శ్రీలీలకి.
Also Read: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ బ్రేక్ ఈవెన్ సాధించేసిందా.?
ఈ సిట్యువేషన్‌ని అల్లరి పిల్ల శ్రీలీల ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి మరి. అన్నట్లు బోయపాటి శీను – రామ్ పోతినేని కాంబినేషన్‌లో ‘స్కంధ’ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు తాజా సమాచారం.