Table of Contents
Sreeleela Marriage Gossips.. నటి శ్రీలీల పెళ్ళి చేసుకోబోతోందట.! ఇందులో వింతేముంది.? చేసుకుంటే చేసుకోవచ్చు.!
‘కమింగ్ సూన్’ అంటూ, సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని శ్రీలీల విడుదల చేసింది. దాంతో, రకరకాల ఊహాగానాలు షురూ అయ్యాయి.
ఇంతకీ, శ్రీలీల పెళ్ళి నిజమేనా.? ఇదంతా ఉత్తుత్తి పుకార్ల వ్యవహారమేనా.? ‘కమింగ్ సూన్’ అంటూ, శ్రీలీల విడుదల చేసిన ఫొటోల వెనుక సీక్రెట్ ఏంటి.?
Sreeleela Marriage Gossips.. ప్రేమలో పడిందా.?
ఓ బాలీవుడ్ నటుడితో శ్రీలీల పెళ్ళంట.. అంటూ, గత కొన్నాళ్ళుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాదు కాదు, ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో తనయుడితో శ్రీలీల క్లోజ్‌గా వుంటోందన్న గాసిప్స్ కూడా వింటున్నాం.
తూచ్.. అదీ కాదు, ఇదీ కాదు.. అసలంటూ, శ్రీలీలకి ఇప్పట్లో ప్రేమించాలన్న ఆలోచనగానీ, పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనగానీ లేదు.. అంటూ, ఎప్పటికప్పుడు ఖండన ప్రకటనలూ వస్తున్నాయ్.

ఇంతకీ, శ్రీలీల తాజా ఫొటోల వెనుక వున్న మర్మమేంటబ్బా.? మళ్ళీ అదే క్వశ్చన్.. అదే కన్‌ఫ్యూజన్.
పుట్టినరోజు వేడుకలట..
శ్రీలీల పుట్టినరోజు నేపథ్యంలో, ఇంట్లో పండగ వాతావరణాన్ని ఆమె తల్లి క్రియేట్ చేశారట. అయితే, శ్రీలీల పుట్టినరోజుకి ఇంకా సమయం వుంది కదా.?
ఔను, దానికింకా సమయం వుంది. అది క్యాలెండర్ ‘డేట్’ లెక్క. ఇదేమో, తిథుల ప్రకారం పుట్టిన రోజు లెక్క అట. అంటే, ఇంగ్లీషు బర్త్ డే, తెలుగు పుట్టిన రోజు అన్న మాట.
ఇలాక్కూడా చేసుకుంటారా.? అని ముక్కున వేలేసుకోకండి.. శ్రీలీల ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్‌గా వుండాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆమె తల్లి అన్నీ ప్లాన్ చేస్తుంటుంది.
బాలీవుడ్ ఎఫైర్.. ఉత్తదేనా.?
మళ్ళీ మొదటికి వచ్చింది యవ్వారం.. ఇంతకీ, బాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల ఎఫైర్ మాటేమిటి.? అబ్బే, అది జస్ట్ స్నేహమే.. అంటూ ఓ వాదన తెరపైకొస్తోంది.
ఏమో, అదెంత నిజమో.! ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన ఫొటోలు, వీడియోలు అయితే వైరల్‌గా మారాయి సోషల్ మీడియాలో.
Also Read: సమీక్ష ‘ఓదెల-2’: ఓటీటీలో ఉచితమే అయినా, టైమ్ వేస్ట్!
సినిమా అన్నాక ఇవన్నీ మామూలే కదా.! అంటే, సినిమా స్నేహాలన్నమాట. ఇక, శ్రీలీల చేసిన, చేస్తున్న సినిమాల విషయానికొస్తే, మొన్నీమధ్యనే ‘రాబిన్‌హుడ్’ సినిమాలో కనిపించింది శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.