Sreeleela Skanda Dance Ram.. శ్రీలీల అంటేనే డాన్సులు.. డాన్సులంటేనే శ్రీలీల.! అందం, అభినయం.. ఇవన్నీ తర్వాత.! ముందైతే, శ్రీలీల డాన్సులకే ఫిదా అయిపోతారు ఎవరైనా.!
‘పెళ్ళి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల (Sreeleela), అతి తక్కువ సమయంలోనే అనూహ్యమైన స్టార్‌డమ్ దక్కించుకుంది.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినా.. ముందుగా హీరోయిన్ రేసులో శ్రీలీల (Sreeleela) పేరే వినిపిస్తోంది.
Sreeleela Skanda Dance Ram.. స్కంద.. డాన్సుల్లో అదరగొట్టేసింది.!
తాజాగా ‘స్కంద’ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘నీ చుట్టూ.. చుట్టూ..’ అంటూ సాగే ఈ సాంగ్‌లో హీరో రామ్ పోతినేని డాన్సులు అదరగొట్టేశాడు.
ఔను, రామ్ పోతినేని (Ram Pothineni) డాన్సుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? యాజ్ యూజువల్.. సూపర్బ్‌గా చేశాడు.
ఇక, శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి.! డాన్స్ అంటే, చాలా చాలా ఇష్టం ఆమెకి. డాన్స్‌లో లీనమైపోతుంటుంది. చూసేవాళ్ళ మతులు పోగొట్టేస్తుంటుంది తన మూమెంట్స్‌తో.!
పైగా, పెన్సిల్ హీల్స్‌తోనూ చాలా తేలిగ్గా.. ఈజ్‌తో.. కష్టమైన స్టెప్స్ వేసెయ్యడం శ్రీలీలకే (Sreeleela Skanda) చెల్లుతుందేమో.!
ప్రేమ్ రక్షిత్ (Prem Rakshit) ఈ పాటకి నృత్య దర్శకత్వం వహించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంద’ సినిమా తెరకెక్కుతోంది.