Sri Satya BiggBoss Food.. మనిషన్నోడెవడైనా అన్ని దోశెలు తింటాడా.? ఎన్ని దోశెలు అంటారా.? రోజుకి 17 నుంచి 18 దోశెలు. అసాధ్యమే కదా. కానీ, శ్రీ సత్యకు సాధ్యం. అదేనండీ.! బిగ్‌బాస్ బ్యూటీ శ్రీ సత్య.
బిగ్‌బాస్ ఆరో సీజన్‌కి బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌గా వచ్చింది కదా.. ఆ బ్యూటీ పేరే శ్రీ సత్య. ఈ అమ్మడు హౌస్‌లోకి ఎంటర్ అయిన డే వన్ నుంచీ ‘తిండిపోతు’ అని పెద్ద ముద్ర వేయించేసుకుంది.
వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా ‘తిండి తినడానికే బిగ్ హౌస్‌లోకి వచ్చావా.?’ ఆటేదీ.? అని శ్రీ సత్యకు గట్టిగా గడ్డెట్టేశాడు. ఇంకేముంది. శ్రీ సత్య అంత తోప, తపేలా అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరిగింది.
Sri Satya BiggBoss Food ఇంత తిండిపోతు అంత అందంగా ఎలా.?
తీరా చూస్తే, అక్కడ కూడా శ్రీ సత్య తుస్ అని తేల్చేసి, తిండికి బ్రాండ్ అంబాసిడర్ చేసేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా గెస్ట్‌గా వస్తే, నేను శనివారం కూడా చికెన్ తినేస్తా.. అంటూ తమన్నాతో చెప్పింది.

అదేనండీ ఓ సినిమాలో తమన్నాకి ఒక్క శనివారం తప్ప డైలీ చికెన్ వుండాల్సి వస్తుంది కదా.. ఆ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, నాకయితే, శనివారం కూడా చికెన్ వుండాల్సిందే.. అంటూ అస్సలేమాత్రం మొహమాటకుండా చెప్పేసింది.
ఎటు చూసినా శ్రీ సత్య తిండిపోతుతనమే బయటపడింది ఇన్ని రోజులు హౌస్‌లో ఆమె పర్‌ఫామెన్స్ తీస్తే. మరో ట్విస్ట్ ఏంటంటే, తాజాగా తన తోటి కంటెస్టెంట్‌తో శ్రీ సత్య చెప్పిన ‘తిండి’ మాటలు నెటిజన్లను మరింత విస్తుపోయేలా చేస్తున్నాయ్.
ఇంట్లో వుంటే దోశెలన్నీ నాకే,.
బిగ్‌బాస్ పనిష్‌మెంట్‌లో భాగంగా వరస్ట్ పర్ఫామర్‌గా తేలి జైల్లో కూర్చున్న శ్రీ సత్య (Sri Satya), తన తోటి కంటెస్టెంట్‌తో ఇంట్లో వుంటే, డైలీ 17 నుంచి 18 దోశెలు తింటాను తెలుసా.? అని నిసిగ్గుగా తెలియ చెప్పింది.
అలా ఇక్కడ చేయడం లేదుగదా. నన్నెలా తిండిపోతు.? అంటారు అని బహుశా నాగార్జున మాటలకు కౌంటర్ ఇచ్చిందో ఏమో శ్రీ సత్య.
Also Read: జస్ట్ ఆస్కింగ్.! ఆ అవార్డుకి పూజా హెగ్దే అర్హురాలేనా.?
మొత్తానికి అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అనే రేంజులో సోషల్ మీడియాలో పీఆర్ టీమ్‌లను సెట్ చేసుకుని హౌస్‌లోకి వచ్చిన శ్రీ సత్య చేసిన పర్ఫామెన్స్ నిర్వాకం అయితే ఇది.
ఇదే పర్ఫామెన్స్ కంటిన్యూ చేస్తే, హౌస్ నుంచి బిగ్‌బాస్ గెంటేయడం ఖాయం. జర జాగ్రత్త శ్రీ సత్య.! అంటూ నెటిజన్లు స్వీట్‌గా హెచ్చరిస్తున్నారు శ్రీ సత్యని.