Srinidhi Shetty Glamorous Touch.. శ్రీనిధి శెట్టి.. అంటే గుర్తొచ్చేది ‘కేజీఎఫ్’. ‘కేజీఎఫ్’ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తూనే సీరియస్ లుక్స్‌తో కిర్రాకెత్తిస్తుందీ అందాల భామ శ్రీనిధి శెట్టి.
దాంతో, శ్రీనిధి శెట్టి అంటే కేవలం సీరియస్ రోల్స్‌కే సెట్టవుతుందా.? అని డౌటానుమానం వచ్చేసింది. ‘కేజీఎఫ్’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది శ్రీనిధి శెట్టి.
సీనియర్ హీరో విక్రమ్‌తో ‘కోబ్రా’ అనే సినిమాలో నటించినా ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. తెలుగులో నాని హీరోగా ‘హిట్ 3’ సినిమాలో శ్రీనిధి శెట్టి నటించింది.
Srinidhi Shetty Glamorous Touch.. ఒపీనియన్ మార్చుకోవాల్సిందే..
తెలుగులో ఇదే ఆమెకు స్ట్రెయిట్ మూవీ. ఈ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. రాశీ ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇద్దరు హీరోయిన్లున్నారు కదా.. అని ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. అంటోంది అందాల భామ శ్రీనిధి శెట్టి.

ఇందులో డిఫరెంట్ సబ్జెక్టేదో వుందట. అది మాత్రం సినిమా చూశాకే తెలుస్తుందట. అసలు మ్యాటర్‌కి వచ్చేస్తే.. శ్రీనిధి శెట్టికి ఈ సినిమా చాలా చాలా ప్రత్యేకమట.
ఇంతవరకూ సీరియస్ లుక్స్‌లోనే తనను చూశారనీ.. ఈ సినిమాతో తనపై వున్న ఒపీనియన్ మారబోతుందనీ అంటోంది.
సీరియస్ మోడ్ నుంచి రొమాంటిక్ మోడ్‌లోకి..
నిజమే.! ‘కేజీఎఫ్’ లాంటి ఓ భారీ హిట్టు తర్వాత శ్రీనిధి శెట్టికి చాలా చాలా ఆఫర్లు వచ్చుండాలి.. స్టార్ హీరోయిన్ అయిపోయుండాలి. కానీ, అలా జరగలేదు.
అందుకు కారణం అదే కావచ్చు. నిజానికి శ్రీనిధి శెట్టికి రొమాంటిక్ స్టోరీలంటేనే చాలా ఇష్టమట.

‘హిట్ 3’లో యాక్షన్ గర్ల్ పాత్ర అయినప్పటికీ ఓ సాంగ్ కోసం హీరో నానితో డిజైన్ చేసిన రొమాంటిక్ ట్రాక్ చాలా క్యూట్‌గా వుంటుంది.
కానీ, క్యారెక్టర్ మాత్రం సీరియస్‌గా డామినేట్ చేస్తుంది. ‘తెలుసు కదా’లో పాత్ర తన హార్ట్‌ని టచ్ చేసిందనీ, ఈ సినిమా తర్వాత ఈ తరహాలోనే మరెన్నో పాత్రలు చేయాలనుందని శ్రీనిధి శెట్టి చెబుతోంది.
Also Read: రష్మిక, విజయ్.. ఇంత రహస్యమెందుకు.?
నిజమే, ‘తెలుసు కదా’ సినిమాలో శ్రీనిధి శెట్టి చాలా క్యూట్ లుక్స్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోలు, ప్రచార చిత్రాలు ఎట్రాక్ట్ చేస్తున్నాయ్.
ఈ సినిమా హిట్టయితే, శ్రీనిధి శెట్టి కోరుకున్నట్లే.. సీరియస్ మోడ్ నుంచి రొమాంటిక్ మోడ్‌లోకి ఆఫర్లు ఆమెకు తెలుగులో క్యూ కడతాయేమో.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
